సంపద సృష్టి, త్వరలో ఈ చార్జీల మోత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే మద్యం విషయంలో ధరలు తగ్గించి, పాత బ్రాండ్ లను మళ్ళీ తీసుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే మద్యం విషయంలో ధరలు తగ్గించి, పాత బ్రాండ్ లను మళ్ళీ తీసుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో డిసెంబరు 1 నుంచి మరింత భారం కానున్నాయి రిజిస్ట్రేషన్లు. ఏపీలో ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలను డిసెంబరు 1 నుంచి పెంచాలని ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
గడచిన రెండు నెలలుగా… జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం ఆమోదంతో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కనిష్ఠంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం తెలుస్తోంది. భూముల ధరలు కూడా ఏపీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి.