అద్దె కారు 61 లక్షలా.. స్మిత ఇక తప్పించుకోలేరా ?
స్మిత సబర్వాల్.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అధికారి అని పేరు ! తన పేరుతో.. తన పేరు చుట్టూ ఎన్ని వివాదాలు నడిచినా.. డ్యూటీ మాత్రమే తెలుసు అనుకునే రకం. పరిపాలనతో తనదైన ముద్ర వేసుకుంటూ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

స్మిత సబర్వాల్.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అధికారి అని పేరు ! తన పేరుతో.. తన పేరు చుట్టూ ఎన్ని వివాదాలు నడిచినా.. డ్యూటీ మాత్రమే తెలుసు అనుకునే రకం. పరిపాలనతో తనదైన ముద్ర వేసుకుంటూ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి స్మితకు ఇప్పుడు షాక్ తగలబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన పని.. తలపోటుగా మారిందా.. కొత్త చిక్కులు తీసుకురాబోతోందా.. ఇన్నాళ్లు ఏ మచ్చ లేని కెరీర్‌కు మచ్చలా మిగిలిపోనుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. నిబంధనలకు విరుద్ధంగా.. స్మిత ఓ కారును యూజ్ చేశారనే ఆరోపణలు బయటకు వచ్చాయ్. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పని తీరుపై ఏజీ విచారణ జరపగా.. కొన్ని తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆ అవకతవకల్లో స్మిత కారు అద్దె వ్యవహారం బయటకు వచ్చింది. సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా స్మిత బాధ్యతలు నిర్వహించారు. 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు అధికారిణిగా.. ఓ వాహనం ఉపయోగించారు.
ఐతే దీనికి నెలకు 63 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన ఇన్నోవా కారును.. ఇంత మొత్తం అద్దె చెల్లించి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అద్దె రూపంలో 90 నెలలకు.. 61 లక్షలు తీసుకున్నారు. ఐతే ఆమె అద్దెకు తీసుకున్న ఇన్నోవా కారు నాన్ టాక్స్ కాదని.. ఎల్లో ప్లేట్ కూడా కాదని తేలింది. ప్రైవేటు వ్యక్తిగత వాహనం ఒకరి పేరిట ఉంది. సీఎంఓ స్మిత సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రసీదులు వచ్చాయనే విషయాన్ని.. యూనివర్సిటీ యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. ఐతే ఈ వ్యవహారంలో త్వరలోనే నోటీసులు అందిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే.. స్మితకు భారీ షాక్ తగలడం ఖాయం. నోటీసులిస్తే ఏం జరుగుతుంది.. ఏం తేలుతుందన్న సంగతి ఎలా ఉన్నా.. ఇన్నాళ్లు కాపాడుకున్న పేరుకు మసక వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఐతే ఇక్కడ మరో వాదన ఉంది.
వ్యవసాయ వర్సిటీ నుంచి అద్దె వాహనం వినియోగించటానికి కారణం.. ఆమె వ్యవసాయ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారని.. ఇదంతా టెక్నికల్ ఇష్యూనే తప్పించి మరొకటి కాదని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చి.. ఇంత రచ్చ వెనుక ఆమెను ఎవరో కావాలనే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుందనే చర్చ కూడా ఉంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఒక్కసారి నోటీసులు వెళ్తే.. అది స్మిత కెరీర్‌కు మచ్చలా మిగిలే చాన్స్ ఉంటుంది. ఆమె గురించి మాట్లాడిన ప్రతీసారి ఆ నోటీసులు గురించి ప్రస్తావన రావడం ఖాయం. దీంతో యిప్పుడేం జరగబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి తెలంగాణలో ప్రభుత్వం మారాక.. స్మిత సబర్వాల పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరిగింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న కొత్తలో.. మీటింగ్‌లకు కూడా హాజరుకాలేదు. ఐతే ఆ తర్వాత ఉన్నట్లుండి.. సీతక్కను కలిశారు. ఐతే ఆ తర్వాత స్మితను ప్రాధాన్యం లేని పోస్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది రేవంత్ సర్కార్.. ఇదే స్మితకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అధిక ప్రాధాన్యత లభించింది. అలాంటిది ఇప్పుడు ఆమె చుట్టూ అద్దె కారు వ్యవహారం కమ్మేయడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది.