CM Revanth Reddy : ఆ పదవిలో ప్రస్తుతానికి రేవంతే.. మరి ఆ తర్వాత ఎవరు ?
తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. తన మార్క్ పాలనతో.. గ్రౌండెడ్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నా.. సామాన్యులను కలుస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. ఐతే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సీఎంగా రేవంత్ రాబోయే రోజుల్లో మరింత బిజీ కాబోతున్నారు. దీంతో నెక్ట్స్ ఏంటి అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. తన మార్క్ పాలనతో.. గ్రౌండెడ్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నా.. సామాన్యులను కలుస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. ఐతే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. సీఎంగా రేవంత్ రాబోయే రోజుల్లో మరింత బిజీ కాబోతున్నారు. దీంతో నెక్ట్స్ ఏంటి అనే చర్చ ఆసక్తికరంగా మారింది. నెక్ట్స్ ఏంటి అంటే.. సీఎం విషయంలో కాదు.. పీసీసీ చీఫ్ విషయంలో..! ప్రస్తుతానికి పీసీసీ చీఫ్‌గా రేవంతే ఉన్నారు. ఐతే ఆయన తర్వాత ఎవరు అన్నది.. రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. సీఎంగా రేవంత్ తీరిక లేకుండా ఉంటారని.. దీంతో పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించారని అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తే రాబోయే స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉందని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Praja Bhavan : ప్రజాభవన్ వద్దంటున్న రేవంత్ !
రేవంత్ సారధ్యంలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అంతే సమర్థత ఉన్న నాయకుడికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నా.. ఏ సామాజికవర్గానికి చెందిన నేతకు అప్పగించాలనే విషయంపై చర్చ జరుగుతోంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పదవిలో ఉండగా.. ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు. అప్పట్లో రేవంత్‌కు కాకుండా ఆ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబులాంటి వారు గట్టి ప్రయత్నాలు చేశారు. ఐతే అప్పట్లో రేవంత్ వైపే రాహుల్ మొగ్గు చూపించారు. అప్పట్లో ఈ పదవి ఆశించిన వాళ్లంతా.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. దీంతో వారికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం లేవు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని, 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఐతే 24సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ , మధు యాష్కీ గౌడ్, ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి గౌడ్‌తో పాటు ఈ పదవి కోసం మరికొందరు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో రేవంత్ తర్వాత ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.