REVANTH REDDY : మా పోటీ ఐటీ, ఈడీతోనే…. కాంగ్రెస్, బీజీపీతో కాదు: రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోరాడుతోంది బీజేపీ, బీఆర్ఎస్ తో కాదన్నారు పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. ఐటీ, ఈడీలోతో పోరాడుతున్నామనీ... డిసెంబర్ 3న ఈ రెండింటినీ ఓడిస్తామన్నారు.
REVANTH REDDY ON BRS, BJP: కేసీఆర్, మోడీ (KCR & MODI) మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రైతు బంధు, వివేక్, పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు అంశాలపై మాట్లాడారు. ఏకే గోయల్ ఇంట్లో బీఆర్ఎస్ కు చెందిన 300 కోట్లరూపాయలను కాంగ్రెస్ సాక్ష్యాధారాలతో చూపిస్తే… ఎందుకు సీజ్ చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. పైగా కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు. 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు.
ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు చెప్పారు. 2023 ఎన్నికలకు ముందే నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆరెఎస్ కు సహకరించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు రైతు బంధు వేయడం వల్ల రైతులకు 5వేలు నష్టం జరుగుతుందన్నారు. బీఆరెస్ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావద్దని కోరారు పీసీసీ చీఫ్. రైతులు ఆందోళన చెందొద్దు.. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి… కాంగ్రెస్ వచ్చాక మేం ఇవ్వాల్సింది ఇస్తామని హామీఇచ్చారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. 2018లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయమన్నారు రేవంత్. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీకి ఆయన రావణాసురుడిగా కనిపించారా అని ప్రశ్నించారు. ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్లు పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతల ఫోన్లు చేసినా ఎత్తడం లేదు..
ED, ITలు కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా?
బీఆరెస్, బీజేపీ ప్రసంగాలకు , జరుగుతున్న తతంగాలకు పోలిక లేదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ తో మాపై కుట్రలు చేస్తున్నారు. డబ్బు సంచులతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చి కేసీఆర్ గెలవాలని ప్లాన్. నగదు బదిలీ పథకం మొదలైంది.. బీఆరెస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని పీసీసీ చీప్ విజ్ఞప్తి చేశారు.