REVANTH REDDY: సీఎంగా రేవంత్.. స్వగ్రామంలో సంబరాలు..
దీంతో రేవంత్ ఇంటి వద్ద సందడి, పండుగ వాతావరణం నెలకొంది. రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సందడి నెలకొంది. తమ నియోజకవర్గం నుంచి రేవంత్ సీఎం అవుతున్నందుకు ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు.

REVANTH REDDY: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఎంపిక కావడంతో ఆయన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో సంబరాలు మొదలయ్యాయి. గ్రామస్తులంతా టపాసులు కాలుస్తూ.. సంబరాలు జరుపుకొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా సంబరాల్లో పాల్గొంటున్నారు. “మా రేవంత్ పటేల్ సీఎం అయ్యాడు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. రేవంత్ అప్పటికీ, ఇప్పటికీ మా మంచి పటేల్. ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు. సీఎం ఊరు. ఎప్పుడు ఊరికి వచ్చినా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడు” అంటూ రేవంత్ గ్రామస్తులు వ్యాఖ్యానించారు.
REVANTH REDDY: రేవంత్ రెడ్డి ప్రొఫైల్..
దీంతో రేవంత్ ఇంటి వద్ద సందడి, పండుగ వాతావరణం నెలకొంది. రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కూడా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సందడి నెలకొంది. తమ నియోజకవర్గం నుంచి రేవంత్ సీఎం అవుతున్నందుకు ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి నివాసం దగ్గరకు చేరుకొని, సంబరాలు జరుపుకొంటున్నారు.