REVANTH REDDY: తమ్ముడికి ఛాన్స్‌! మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ తమ్ముడు!

రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి మల్కాజ్‌గిరి బరిలో ఉంటారా అంటే దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 04:59 PMLast Updated on: Feb 07, 2024 | 4:59 PM

Revanth Reddy Brother Kondal Reddy Contesting From Malkajgiri

REVANTH REDDY: తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్, బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న వేళ.. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతీ విషయంలో హస్తం పార్టీ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐతే ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం మీదే ఉంది. సీఎం రేవంత్‌.. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలవడంతో ఈసారి కాంగ్రెస్‌ తరఫున ఎవరు బరిలో నిలవబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది.

Ponnam Prabhakar: ఖరీదైన గిఫ్ట్‌ ! కొత్త వివాదంలో మంత్రి పొన్నం.. ఆ కారు మెడకు చుట్టుకుంటోందా ?

రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి మల్కాజ్‌గిరి బరిలో ఉంటారా అంటే దాదాపు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం కోసం కొండల్‌ గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. రాష్ట్ర నాయ‌క‌త్వం కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపింది. మల్కాజ్‌గిరి నుంచి నిర్మాత బండ్ల గణేష్‌, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లు అధిష్టానానికి పంపారు. వీరిలో ఒకరి పేరును హైకమాండ్ ఫైనల్ చేయనుంది. ఎన్నికల్లో కొండల్ రెడ్డి చురుకుగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయగా.. కామారెడ్డిలో రేవంత్ తరఫున అన్ని తానై చూసుకున్నారు కొండల్ రెడ్డి. స్థానిక నాయకులతో సమన్వయం చేసుకున్నారు. ఐతే మరి మల్కాజ్‌గిరి టికెట్ తన తమ్ముడికి ఇప్పించుకుంటారా.. అదే జరిగితే మిగతా నేతల రియాక్షన్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. మల్కాజ్‌గిరి మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు.

కుటుంబానికి ఒకటే టికెట్ అని కాంగ్రెస్ అప్పట్లో చెప్పారు. మరి ఇప్పుడు రేవంత్ విషయంలో ఆ నినాదాన్ని హైలైట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే అంచనాలు వినిపిస్తున్నాయ్. ఏమైనా లోక్‌సభ టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో చాలామంది వారసులు వెయిట్‌ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌ రెడ్డి మల్కాజ్‌గిరి టికెట్ ఆశిస్తుంటే.. నల్గొండ టికెట్ కోసం జానారెడ్డి కొడుకు రఘువీర్‌, కోమటిరెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు చేసుకున్నారు. మరి వారసులకు టికెట్లు ఇస్తుందా.. సంచలన నిర్ణయాలు ఉంటాయా అన్నది ఎదురుచూడాలి మరి.