REVANTH REDDY: శాసన మండలిపై రేవంత్ వ్యాఖ్యలు.. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు..
శాసన మండలి గురించి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిని ఇరానీ కేఫ్‌గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా రేవంత్ వర్ణించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
REVANTH REDDY: శాసన మండలిపై ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శాసన మండలి గురించి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిని ఇరానీ కేఫ్‌గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా రేవంత్ వర్ణించారు.
Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..
ఈ వ్యాఖ్యలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్‌పై కౌన్సిల్ చైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ సురభివాణి దేవి ఫిర్యాదు చేశారు. సురభి వాణి దేవితోపాటు ఎమ్మెల్సీలు ఎం.ఎస్.ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్ వంటి వాళ్లు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ప్రతిని మీడియాకు విడుదల చేశారు. రేవంత్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ సందర్భంగా రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులను ల్యాండ్ డీలర్స్, బ్రోకర్లుగా అభివర్ణించడం సరికాదన్నారు.
మండలిలో ఎందరో నిజాయితీ గల వ్యక్తులు ఉన్నారని, కళ, సాంస్కృతిక, విద్య సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని, అలాంటి వారిపై వ్యాఖ్యానించిన రేవంత్‌పై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.