భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చామని.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించాం అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నానన్నారు. తెలంగాణలో ఒకేసారి రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్న ఆయన దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారని 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే అని మండిపడ్డారు. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, రూ. 500 కి సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్న్నారు. [embed]https://www.youtube.com/watch?v=QMlkfKQEqIE[/embed]