బ్రేకింగ్: మోడీకి రేవంత్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు.. అన్ని హామీలు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు.. అన్ని హామీలు పూర్తి చేసే దిశగా ముందుకెళ్తున్నాం అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఏడాది పూర్తికాకుండానే 22.22లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశాం అన్నారు.
ఇది దేశంలో చరిత్రాత్మకమని తెలిపారు ఆయన. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో గ్యాస్ సిలిండర్లకు రూ.500 సబ్సిడీ ఇస్తున్నామని పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం నిర్వహించని విధంగా.. అన్ని పోటీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం అని స్పష్టం చేసారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీ ప్రభుత్వాలు సాధించలేని రికార్డులు ఇవి అని ఎక్స్ లో పోస్ట్ చేసారు. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలతో పాటు.. ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు. పదేళ్ల తర్వాత ఉదయిస్తున్న సూర్యుడి వల్లే.. ఇప్పుడు తెలంగాణ వెలుగులోకి వస్తుందన్నారు.