మోడీ ఆపకపోతే నేను ఆపను: రేవంత్ వార్నింగ్

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2024 | 01:26 PMLast Updated on: Nov 09, 2024 | 1:26 PM

Revanth Reddy Fire On Pm Modi

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారన్నారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా అని తెలిపారు.

దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయన్నారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామన్న ఆయన ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేసామని తెలిపారు. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు.

తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామన్నారు రేవంత్. ఆ తరువాత ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారని… ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేసారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామన్న రేవంత్.. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారని తెలిపారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామన్నారు. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని ఆయన వివరించారు.