REVANTH REDDY Vs KTR: కేసీఆర్, కేటీఆర్ ఇక కాస్కోండి..! రేవంత్ ఎటాక్ మొదలుపెట్టాడు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. విమర్శలు చేయొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేస్తాం అనే స్థాయికి వచ్చారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఢీ అంటే ఢీ అంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 26, 2024 | 04:24 PMLast Updated on: Jan 26, 2024 | 7:53 PM

Revanth Reddy Fires On Brs Leaders Ktr Kcr Over Their Critisism On Congress

REVANTH REDDY Vs KTR: తెలంగాణలో పదేళ్ళు పాలించారు. అహంకారం ప్రదర్శించారు. జనం అంటే లెక్కలేకుండా ప్రవర్తించారు. జనానికి దిక్కులేదు. తమకే ఓట్లేస్తారు. ఎప్పటికీ తమనే గెలిపిస్తారని అనుకున్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఇప్పుడు అధికారం నుంచి దించేసినా ఇంకా అదే ధోరణి కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. విమర్శలు చేయొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేస్తాం అనే స్థాయికి వచ్చారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పటిదాకా ఇంటర్వెల్ మాత్రమే.. ఇక అసలు స్టోరీ ముందుంది అంటూ బీఆర్ఎస్ పెద్దలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

PAWAN KALYAN: రెండు సీట్లు ప్రకటించిన జనసేన.. టీడీపీ సీట్ల ప్రకటనపై పవన్ ఆగ్రహం

ఇక సీఎం రేవంత్ కాదు.. పీసీసీ ఛీఫ్ రేవంత్‌ను చూడబోతున్నామా అనిపిస్తోంది. తెలంగాణ తెచ్చామని చెప్పుకున్నా.. పదేళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేశామని జబ్బలు చరుచుకున్నా.. ఓటర్లు బీఆర్ఎస్‌ను ఎందుకు ఓడించారు. కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కి ఎందుకు పంపారు. ఇప్పటిదాకా గులాబీ పార్టీ ఈ అంశాలపై సమీక్ష చేసుకున్నట్టు లేదు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అహంకారంగా ఉన్నారో ఇప్పుడూ అదే ధోరణిలో ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించి బాధపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇదే ధోరణి కంటిన్యూ అయితే.. మళ్ళీ కారు పార్టీ ఇక అధికారంలోకి వచ్చే ఛాన్సే ఉండదని తెలియట్లేదు. కేసీఆర్, బీఆర్ఎస్ అంటే సింపతీ ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడమే తప్ప జనంలో మాత్రం అలా లేదు. రేపో, మాపో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం.. మళ్ళీ కేసీఆర్‌ని ముఖ్యమంత్రి చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలి. ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జనమే దించేస్తారు. ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆ పాత్ర పోషించాలి.

Anil Kumar Poluboina: ఎంపీగా పోటీ చేయనున్న అనిల్ కుమార్ యాదవ్..?

మళ్ళా జనం ఎన్నుకుంటే అధికారంలోకి రావాలి. కానీ ఐదేళ్ళు కాకముందే.. మళ్ళీ జనం నెత్తిన ఎక్కి కూర్చొని పెత్తనం చేస్తామంటే ఊరుకుంటారా..? తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌కి ఇచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా లాక్కుంటానంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చూస్తూ ఊరుకునే మనిషి కాదు. ఎన్నో డక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి వచ్చారు. అందుకే ఎల్‌బీ స్టేడియంలో జరిగిన మీటింగ్‌లో తను ఏంటో చెప్పాడు. బిల్లా రంగడు.. ఛార్లెస్ శోభరాజ్ లాంటి పదాలు వాడుతూ.. కేటీఆర్‌కు అంతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు మిగతా ప్రాజెక్టులు విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా రేస్.. ఇలా ఎన్నో స్కామ్స్‌పై విచారణ జరుగుతోంది. ఎక్కడో అక్కడ ఆ ముగ్గురూ దొరికే అవకాశాలు ఉన్నాయి. పులి బయటకొస్తోందని కేసీఆర్‌ని ఉద్దేశించి చేసిన కేటీఆర్ కామెంట్స్‌పైనా స్పందించారు రేవంత్. పులి బయటకు వస్తే బోనులో వేసి.. బొంద పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మేస్త్రీని అన్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా తెగ ట్రోలింగ్ చేస్తోంది. అందుకే దానికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు.

మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్ నిర్మించే మేస్త్రీని. మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని అంటూ. ఈనెలలో ఇంద్రవల్లి వస్తా కాస్కోండి అని సవాల్ చేశారు రేవంత్. ఆయన అమెరికాలో కూడా ఇలా దూకుడుగానే మాట్లాడారు. అప్పుడు సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం ఏంటని కేటీఆర్, కవిత విమర్శించారు. కానీ, గత కొన్ని రోజులుగా కేటీఆర్ వార్నింగ్స్ చూస్తూ.. రేవంత్ అలా జవాబు ఇవ్వడంలో తప్పులేదనిపిస్తోంది. సీఎంగా ఉన్నా కాబట్టి.. ఇన్నాళ్ళు పాలన మీద దృష్టి పెట్టా. రాజకీయంగా మాట్లాడలేదు. కానీ అలా మాట్లాడకపోతే పని జరిగేలా లేదు అన్నారు రేవంత్. అంటే ఇక నుంచి తెలంగాణ ప్రజలు పాత రేవంత్ రెడ్డిని చూడబోతున్నారు. ఆ ముగ్గురికీ అదే తరహాలో రేవంత్ స్టాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.