సీఎం రేవంత్ గొప్ప నిర్ణయం ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు
తెలంగాణలో అధికారం చేపట్టిదగ్గర్నించి సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా ఏర్పాటుతో కొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రేవంత్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో అధికారం చేపట్టిదగ్గర్నించి సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా ఏర్పాటుతో కొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రేవంత్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క యాచించటమే తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్ జెండర్లకు ఓ మార్గం చూపే దిశగా కీలక డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించటం ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో.. ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్‌లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. కొందరు ట్రాన్స్ జెండర్లు కూడా చదువుకుంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తూ.. గౌరవంగా జీవిస్తున్నారు. కానీ.. చాలా మంది ఇప్పటికీ దుకాణాలలో, జంక్షన్ల దగ్గర, రైళ్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ.. బిక్షాటన చేస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతుండుతూ జీవిస్తున్నారు. అయితే.. జీవితంలో గౌరవంగా బతకాలని భావించే చాలా మంది ట్రాన్స్ జెండర్లకు మాత్రం సమాజంలో ఉపాధి అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వారిని పనుల్లో పెట్టుకునేందుకు నిరాకరిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి సీఎంగా రేవంత్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నారు. త్వరలోనే అధికారులు దీనికి సంబంధించిన కార్యారచన విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ జంక్షన్లలో డబ్బుల కోసం వాహనదారుల దగ్గర చేయి చాచిన అదే ట్రాన్స్ జెండర్లు సీఎం రేవంత్ నిర్ణయంతో రేపు ట్రాఫిక్‌ను నియంత్రించబోతున్నారు.