500 Gas Cylinder Scheme: రూ.500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు రూ.500కే సిలిండర్‌ పొందేందుకు అర్హులు. వీరిలో ఇటీవల నిర్వహించిన జాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాన్ని అమలు చేయనున్నట్లు జీవోలో ప్రకటించారు. ఈ మేరకు రూ.500కే గ్యాస్ పథకానికి సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2024 | 04:57 PMLast Updated on: Feb 27, 2024 | 4:57 PM

Revanth Reddy Govt Will Start 500 Gas Cylinder Scheme

500 Gas Cylinder Scheme: తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు పథకం అమలుకోసం రేవంత్ సర్కార్ తాజాగా జీవో జారీ చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటి.

TEAM INDIA: ఇకపై టెస్టుకు 20 లక్షలు.. మ్యాచ్ ఫీజు భారీగా పెంపు..?

తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వం. తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు. వీరిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లు రూ.500కే సిలిండర్‌ పొందేందుకు అర్హులు. వీరిలో ఇటీవల నిర్వహించిన జాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాన్ని అమలు చేయనున్నట్లు జీవోలో ప్రకటించారు. ఈ మేరకు రూ.500కే గ్యాస్ పథకానికి సంబంధించి విధివిధానాలు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 39.5 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరించబోయే విధానం ప్రకారం.. లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాలి. తర్వాత సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుంది. లిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాల్లో సబ్సిడీ డిపాజిట్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే, తర్వాతి కాలంలో నేరుగా చమురు కంపెనీలకే సబ్సిడీ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంటే.. అప్పుడు లబ్ధిదారులు రూ.500 మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చు. అయితే, ఒక ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు కొందరికి అర్హత ఉన్నప్పటికీ.. వారికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ పథకం పొందలేకపోతున్నారు. వారికి తర్వాతి కాలంలో సిలిండర్ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ‘గృహజ్యోతి’ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయనుంది.