వెనక్కు తగ్గను, మూసీపై రేవంత్ సంచలన నిర్ణయం

తెలంగాణాలో ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో విపక్షాలు ఏ రేంజ్ లో పోరాటం చేస్తున్నా... సిఎం రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మూసీ విషయంలో రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2024 | 11:36 AMLast Updated on: Nov 01, 2024 | 11:36 AM

Revanth Reddy Has Given Special Focus In The Case Of Moosi

తెలంగాణాలో ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ విషయంలో విపక్షాలు ఏ రేంజ్ లో పోరాటం చేస్తున్నా… సిఎం రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మూసీ విషయంలో రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేసారు. వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ మూసీ ప్రాజెక్ట్ పై సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. 15 రోజుల్లో గోదావరి నీళ్లు గండిపేటలో నింపేందుకు టెండర్లు పిలిచారు.

మొదటి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వ‌ర‌కు ప‌నులు పూర్తి చేయనున్నారు. మూసీ ‌పున‌ర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిద‌శ‌లో బాపూఘాట్ అభివృద్ధి చేస్తారు. బాపూఘాట్ లో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. మల్లన్న సాగర్ నుంచి రూ.7వేలకోట్లతో నీటిని ఉస్మాన్‌ సాగ‌ర్‌కు… బాపూఘాట్ వద్ద ఎస్టీపీల‌తో నీటిని శుద్ధి చేసి మూసీలోకి విడుదల చేస్తారు. ఎస్టీపీలకు 7 వేలా కోట్ల తో టెండర్లు ఆహ్వానించారు. ముందుగా ఫస్ట్ ఫేజ్ పై దృష్టి పెట్టిన సీఎం… ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. బాపు ఘాట్ ను రాష్ట్ర ప్రభుత్వం సుందరీకనుంది ప్రభుత్వం.