చూడు నీ కొడుకు బాగోతం.. నిండు సభలో అరవింద్ పరువు తీసిన సీఎం
గత ప్రభుత్వాలతో ఏదో ఒక రకంగా సయోధ్య కుదుర్చుకుని తమ డిమాండ్లు నెరవేర్చుకున్న తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి దెబ్బకు పట్టపగలే చుక్కలు చూస్తోంది. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక సినిమా పరిశ్రమ పెద్దలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
గత ప్రభుత్వాలతో ఏదో ఒక రకంగా సయోధ్య కుదుర్చుకుని తమ డిమాండ్లు నెరవేర్చుకున్న తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి దెబ్బకు పట్టపగలే చుక్కలు చూస్తోంది. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక సినిమా పరిశ్రమ పెద్దలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ముందు రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసి ఆయనను అసలు పట్టించుకోని సినిమా వాళ్ళు ఇప్పుడు ఆయన మాట మాట్లాడితే భయపడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డితో కయ్యం కంటే సయోధ్య మంచిది అనే అభిప్రాయానికి వచ్చిన సినిమా పెద్దలు నేడు ఆయనను కలవడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా తమ అభిప్రాయాలని సీఎం ముందు ఉంచారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా తాను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి అసలు తను ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిని ఏదోరకంగా కూల్ చేయవచ్చని సినిమా వాళ్ళు శాలువాలు పట్టుకుని కూడా వెళ్లారు. కానీ సినిమా చూస్తే మాత్రం తేడాగా కనబడింది. రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన వాళ్ళు… ఆయన శాంతిస్తాడు అని అంచనా వేసుకున్న పెద్దలకు రేవంత్ రెడ్డి వెళ్లిన వెంటనే షాక్ ఇచ్చారు.
తెలంగాణలో బెనిఫిట్ షోలో ఉండే ప్రసక్తే లేదంటూ తాను ఏం చెప్పాలనుకున్నానో క్లియర్ కట్ గా చెప్పారు. ఇక ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. ఆ వీడియోని అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరు చూశారు. అప్పటివరకు అల్లు అర్జున్ తప్పులేదని భావించిన వాళ్లకు కూడా రేవంత్ రెడ్డి ప్లే చేసిన వీడియోతో క్లారిటీ వచ్చింది. ఇక అక్కడే ఉన్న అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆ వీడియో చూసి మౌనంగా ఉండిపోయారు.
ఒకరకంగా నీ కొడుకు చేసిన తప్పు ఇదే అంటూ రేవంత్ రెడ్డి వీడియోలో చూపిస్తుంటే అల్లు అరవింద్ ఏం మాట్లాడాలో తెలియక తలదించుకున్నారు. అసలు తనకు ఎక్కడ ఒళ్ళు మండిందో, తాను ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందో ఆ వీడియోతో సహా చూపిస్తుంటే… అంతమంది సినిమా పెద్దల ముందు అల్లు అరవింద్ ఏం మాట్లాడలేకపోయారు. ఇక బయటికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీక తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలకు ఇది శుభదినం అంటూ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని సంధ్య థియేటర్ ఘటన తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తాను చెప్పాల్సింది చెప్పారు.
రేవంత్ రెడ్డికి ఉన్న క్లారిటీ చూసి అక్కడ ఏమి మాట్లాడలేకపోయిన అల్లు అరవింద్ ఏదైనా అనవసరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చి… సినిమా పరిశ్రమ పెద్దల ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉందని భావించే సైలెంట్ గా ఉండిపోయారు. ముందు చిరంజీవి వస్తారని అల్లు అరవింద్ భావించినా… ఆయన కూడా హ్యాండ్ ఇవ్వటంతో ఒక రకంగా అంతమందిలో ఆయన ఒంటరిగానే ఉండిపోయారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ని తక్కువ అంచనా వేసి వెళ్లిన సినిమా పెద్దలకు ఆయన ఇచ్చిన షాక్ చూసి మైండ్ బ్లాక్ అయింది.