REVANTH REDDY: అన్నా అని పిలిచిన మహిళ.. పరిగెత్తుతూ వెళ్లిన సీఎం.. లీడర్ అంటే మీరే..

మేం పాలకులం కాదు సేవకులం అటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అక్షరాలా నిజం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇటీవలి ఒక వీడియో ఇదే చెప్తోంది కూడా! ఓ మహిళతో సీఎం ప్రవర్తించిన తీరు.. మనసును ఆనందంతో నిండేలా చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 11, 2023 | 05:22 PMLast Updated on: Dec 11, 2023 | 5:22 PM

Revanth Reddy Responds To A Woman Video Goes Viral

REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ శాఖలపై పట్టు సాధిస్తూనే మరోవైపు జనాల కష్టాలు తెలుసుకుంటున్నారు. వీటన్నింటికంటే.. కేసీఆర్‌ను ఆసుపత్రిలో కలిసి ఓ మెట్టు ఎక్కేశారు రేవంత్ అనే మాట జనాల్లో వినిపిస్తోంది. మేం పాలకులం కాదు సేవకులం అటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి అక్షరాలా నిజం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇటీవలి ఒక వీడియో ఇదే చెప్తోంది కూడా!

Alla Ramakrishna Reddy: రాజీనామా వెనక! ఆళ్ల రాజీనామాకు ఆయనే కారణమా.. అసలేం జరిగింది ?

ఓ మహిళతో సీఎం ప్రవర్తించిన తీరు.. మనసును ఆనందంతో నిండేలా చేస్తోంది. అన్నా అని ఓ మహిళ పిలవగానే.. వెళ్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి ఆమె దగ్గరకు వెళ్లి కష్టం తెలుసుకున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. రేవంత్ అన్నా.. మీతో మాట్లాడాలి అంటూ ఓ మహిళ పిలవగానే… ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన రేవంత్‌.. కేసీఆర్‌ను పరామర్శించి తిరిగి వెళ్తుండగా రేవంత్ అన్నా అంటూ ఓ మహిళ పిలిచింది. మహిళ పిలిచిన వెంటనే స్పందించిన సీఎం.. ఆమె దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో చెప్పమని అడిగారు. దీంతో తన పాపకు ఆస్పత్రి ఖర్చు చాలా అవుతోందని, సాయం చేయాలని కోరింది.

వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామాన్యులు పిలవగానే పలికిన సీఎం రేవంత్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సీఎం అంటే ఇలా ఉండాలి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎం సార్ సలాం అంటూ మరికొందరు ప్రశసంలు గుప్పిస్తున్నారు.