పక్కా స్కెచ్ – పుష్ప అరెస్ట్ అల్లు అర్జున్ పై ఇంత పగ అవసరమా?
అల్లు అర్జున్ హంతకుడు కాదు.. తొక్కిసలాట కు ఆయన ఆదేశించలేదు. పోనీ తొక్కిసలాట క్రియేట్ చేసి రేవతి అనే మహిళ చనిపోవడానికి కారణం కాదు. అలా అని అతను ఆమెను చంపించనూ లేదు. మృతురాలి కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణమూ కాదు.

అల్లు అర్జున్ హంతకుడు కాదు.. తొక్కిసలాట కు ఆయన ఆదేశించలేదు. పోనీ తొక్కిసలాట క్రియేట్ చేసి రేవతి అనే మహిళ చనిపోవడానికి కారణం కాదు. అలా అని అతను ఆమెను చంపించనూ లేదు. మృతురాలి కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష కారణమూ కాదు. పోనీ రీల్ లైఫ్ లా రియల్ లైఫ్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసాడా అంటే అదీ లేదూ.. మరెందుకు అరెస్ట్ చేసారు అంటే…. పుష్ప టూ ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో సహా వచ్చి ..తొక్కిసలాట కు పరోక్షంగా కారణమయ్యారు అనేది అల్లు అర్జున్ పై ప్రధాన అభియోగం. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసులు బుక్ అయ్యాయి. పుష్ప అరెస్ట్ కు ముందే మరొక ఇద్దరిని అరెస్ట్ చేసారు చిక్కడపల్లి పోలీసులు. షార్ట్ కట్ లో కంప్లీట్ స్టోరీ ఇది!
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్న విషయం థియేటర్ యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వలేదు పైగా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవటం వల్లే… తొక్కిసలాట జరిగింది. కంట్రోల్ చేసేందుకే లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. రేవతి చనిపోవాల్సి వచ్చింది. అదే సంధ్య థియేటర్ మేనేజ్ మెంట్ కనుక ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే … సెక్యూరిటీ లాప్స్ ఉండకపోయి ఉండేది . అందుకే ఈ క్రిమినల్ చర్యలు అని పోలీసుల వాదన. నిజమేనేమో సంధ్య థియేటర్ మేనేజ్ మెంట్ బాధ్యతారాహిత్యం వల్లే ఇదంతా జరిగిందేమో అని అందరూ అనుకుంటుండగానే… ఓ ట్విస్ట్… మేము పర్మిషన్ అడిగినా స్పందించలేదు. చిక్కడ పల్లి పోలీసులకు అల్లు అర్జున్ ఎంట్రీ గురించి, పుష్ప టూ ప్రీమీయర్ షో గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని … ఇందుకు ఇదిగో ఈ లెటర్ ఇందుకు సాక్ష్యం అంటూ మీడియాకు ఆ లేఖ కాపీని రిలీజ్ చేసింది సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్. సో..అనుమతి మాత్రమే కాకుండా సెక్యూరిటీ కోసం సంధ్య థియేటర్ యాజమాన్యం వేడుకున్న మాట వాస్తవం అయితే ఎందుకు చిక్కడ పల్లి పోలీసులు లైట్ తీసుకున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాక మళ్లీ కేసులు , అరెస్టులు ఎందుకు తప్పును కవర్ చేసుకునేందుకే ఇదంతా చేస్తున్నారా ఖాకీలు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!
ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అత్యంత కీలకమైనది. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించాలి. చేయించాల్సిందే. కొన్ని గంటలు అయినా సరే జైలులో ఉంచాల్సిందే అనే పంతం, పగ ఎవరివి అంటే… మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కూడా ఈ కుట్రలో పార్టనర్ షిప్ ఉంది అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు నడుస్తున్న టాక్. కొన్నాళ్ల నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అంటూ నడుస్తున్న ఎపిసోడ్, పుష్ప టూ సినిమాను బాయికాట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ, పవన్ కల్యాణ్ అభిమానులు చేసిన వీరంగం గురించి చెప్పుకోవాలంటే టైమ్ సరిపోదు కానీ …. అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య వార్ నడుస్తోంది అనేది క్లియర్ కట్. ఇప్పటి వరకు ఒక లెక్క .. ఇప్పటి నుంచి మరొక లెక్క అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ మరింతగా మంట పెట్టింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి దూసుకొచ్చిన ట్వీట్ … మెగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ , సంక్రాంతి సెలబ్రేషన్స్ ను ముందుగా తీసుకొస్తే…. పుష్ప ఫ్యాన్స్‌కు మాత్రం పగను పెంచింది. యునైటైడ్ వి స్టాండ్… డివైడెడ్ వియ్ ఫాల్ అనేది పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్ట్ సారాంశం. అది ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని సూచిస్తూ పెట్టిన పోస్ట్ అయినప్పటికి … ఇది మావాడిని ఉద్దేశించి పెట్టిందేనని మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయించాల్సిన అవసరం.. అదే పగ ఎందుకుంటుంది అనేది అత్యంత కీలకమైన ప్రశ్న. ఇది తెలియాలంటే … ఈ వీడియో బైట్ చూడాల్సిందే.
పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో… కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్. కాసేపటి తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ అంటూ పని కానిచ్చేసాడు బన్నీ… ఇప్పటికే అల్లు అర్జున్ పై కోపంతో… పుష్ప టూ గ్రాండ్ సక్సెస్ అయిందనే కడుపుమంటతో ఉన్న మెగా ఫ్యాన్స్ , యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేసారు. నా పేరు మర్చిపోతాడా, ఇంత అహంకారమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఊగిపోయారు అంటూ ఏదో సీఎం పక్కన ఛైర్ వేసుకుని కూర్చన్నవాళ్లు చెప్పినట్లు సొల్లు పురాణం రాసుకొచ్చారు. ఇంకా కాస్త హార్ష్ గానే చెప్పాలంటే…. చేతిలో మొబైల్, అందులో డేటా ఉన్న ప్రతి వెధవ … పనికి రాని కబుర్లు రాసుకొచ్చాడు. నిజమేనా.. రేవంత్ రెడ్డికి , అల్లు అర్జున్ పై పగ ఉందా, పేరు మర్చిపోయినంత మాత్రాన బన్నీని అరెస్ట్ చేయించి, సంబుర పడేంత సమయం సీఎం వద్ద ఉందా అంటే… అంతా ట్రాష్. ఇది మెగా ఫ్యామిలీ కుట్ర కాదు. మెగా ఫ్యామిలీ రేవంత్ రెడ్డిని బతిమిలాడుకుని, పేరు మర్చిపోయిన ఎపిసోడ్ ను చూపించి … పగ పెంచి మరీ అరెస్ట్ చేయించిన కుట్ర కుతంత్రం అంత కన్నా కాదు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, రేవతి మృతి నుంచి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం వరకు అంతా అనుకోకుండా జరిగిన ఘటనలు, దుర్ఘటనలే! చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతే తప్పితే మీరు తలలు బ్రద్దలు కొట్టుకుని, గుడ్డలు చించుకుని నోటికి వచ్చినట్లు పోస్టులు పెట్టుకుంటూ ఆరోగ్యాలు నాశనం చేసుకోవద్దనేది నిపుణుల సూచన..మానసిక నిపుణుల వార్నింగ్ కూడాను.