వాడేమైనా సరిహద్దుల్లో యుద్ధం చేసాడా…?: బన్నీపై రేవంత్ సంచలనం…!
సినిమా వాళ్ళు పైసలు పెట్టారు, సంపాదించుకున్నారు పోయిన మహిళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. ఆజ్ తక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారని అక్కడ మహిళ చనిపోయిందన్నారు.
సినిమా వాళ్ళు పైసలు పెట్టారు, సంపాదించుకున్నారు పోయిన మహిళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. ఆజ్ తక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ రెడ్డి… అల్లు అర్జున్ అరెస్టు చేసామంటున్నారని అక్కడ మహిళ చనిపోయిందన్నారు. ఆమె కొడుకు ఇంకా ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడని రేవంత్ అసహనం వ్యక్తం చేసారు. ఇది ప్రజలకు కనపడదా అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు బుక్ అయిందన్న రేవంత్ పది రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారన్నారు.
జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా…? అంటూ ఫైర్ అయ్యారు రేవంత్. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏముండదనన్నారు. కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేదన్న ఆయన కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశాడని, దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదన్నారు. అందుకే అల్లు అర్జున్ ను ఈ కేసులో ఏ11 గా పోలీసులు పెట్టారని స్పష్టం చేసారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది ఎవరు బాధ్యులని నిలదీశారు.
తనకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసన్న ఆయన… అతనికి నేను తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని, అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, నాకు బంధువు అన్నారు ఆయన. అల్లు అర్జున్ భార్య మాకు బంధువని రేవంత్ వివరించారు. అలాగే హోం శాఖ తన వద్ద ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ తనకు స్పష్టంగా తెలుసని… చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నాడని తెలిపారు. సినిమా కోసం పైసలు పెట్టారు పైసలు సంపాదించారని వాళ్లు ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదన్నారు సీఎం.