వన్ ఇయర్ లో బామ్మర్దిని ఫినిష్ చేస్తా: రేవంత్ సంచలన కామెంట్స్
కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల విందు పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేసారు. మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు అంటూ ఎద్దేవా చేసారు. దీపావళి దావత్ అలా చేస్తారు అని మాకు తెలియదన్నారు రేవంత్.
కేటీఆర్ బామ్మర్ది రాజు పాకాల విందు పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేసారు. మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు అంటూ ఎద్దేవా చేసారు. దీపావళి దావత్ అలా చేస్తారు అని మాకు తెలియదన్నారు రేవంత్. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు అని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు అని నిలదీశారు. ఇంటి దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయి అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మూసిపై కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవ్వరు ఎంత అడ్డుకున్న మూసి పునరుజ్జివం చేసి తీరుతా అని స్పష్టం చేసారు. మొదటి ఫేస్ 21 కిలో మీటర్ల వరకు అభివృద్ధి చేస్తాం అన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ ల నుండి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతామన్న్నారు. నెల రోజుల్లో డిజైన్లు పూర్తి అవుతాయని తెలిపారు. మల్లన్న సాగర్ నుండి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామన్నారు.
బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన ఆయన బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతామన్నారు. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగామని 15 రోజుల్లో ఎస్టీపి లకు టెండర్లు పిలుస్తామన్నారు.మూసి ని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తాం అని స్పష్టం చేసారు. మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్,నేచర్ క్యూర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
విపక్ష నేత కేసీఆర్ పై రేవంత్ హాట్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అని ఎద్దేవా చేసారు. వన్ ఇయర్ లో కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశాను అన్నారు. ఆ తర్వాత బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసన్నారు. కేటీఆర్ హరీష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసారు. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా… కేటీఆర్ హరీష్ రావు మీరు కూడా రండని సవాల్ చేసారు. మూసీ ని అభివృద్ధి చేయాలో… లేదో ప్రజలని అడుగుదామన్నారు.