వదలద్దు… రేవంత్ సంచలన ఆదేశాలు
హైదరాబాద్ లో నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసారు.

హైదరాబాద్ లో నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని సీఎం మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్న డీజీపీ… కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ, హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పనవి సీఎం రేవంత్ హెచ్చరించారు.