REVANTH Vs KTR: కేటీఆర్‌ టార్గెట్‌గా రేవంత్‌ భారీ ప్లాన్‌.. ఇక చుక్కలే..

బీఆర్ఎస్‌ను మరింత వీక్‌ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చనే ఆలోచనతో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కేడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసి.. ఆ తర్వాత కేటీఆర్‌ను ఇరుకునపెట్టాలన్న వ్యూహంతో రేవంత్‌ కనిపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 03:42 PMLast Updated on: Jan 31, 2024 | 3:42 PM

Revanth Reddy Targeted Ktr Harish Rao And Brs

REVANTH Vs KTR: తెలంగాణ సీఎంగా బాధ్యతలు అందుకున్న తర్వాత నుంచి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఫోకస్ చేసి.. దర్యాప్తు చేయించడంతో పాటు.. కారు పార్టీలో కీలకమైన కేసీఆర్, కేటీఆర్‌, హరీష్‌పై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. ఇంకొన్ని రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికలు రాబోతున్నాయ్‌. ఆ ఎలక్షన్స్‌లో కారు పార్టీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వొద్దని.. రేవంత్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. దీనికోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

Indian Graziers: చైనాకు చుక్కలు చూపించిన భారత గొర్రెల కాపర్లు.. మీ తోక కత్తిరించేందుకు వీళ్లు చాలురా..

బీఆర్ఎస్‌ను మరింత వీక్‌ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చనే ఆలోచనతో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ కేడర్‌ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసి.. ఆ తర్వాత కేటీఆర్‌ను ఇరుకునపెట్టాలన్న వ్యూహంతో రేవంత్‌ కనిపిస్తున్నారు. ఇప్పుటికే పురపాలికల్లో చకచకా పావులు కదుపుతున్నాయ్. చాలాచోట్ల కార్పొరేషన్‌ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు కనిపిస్తున్నాయ్. దీన్నే కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో అమలు చేయాలని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సిరిసిల్ల మీద రేవంత్‌ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముస్తాబాద్‌ జడ్పీటీసీ, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్‌లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. దీంతోపాటు దాదాపు 40మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం చేయించేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కేటీఆర్‌ను కూడా కౌన్సిలర్లు పట్టించుకోకుండా ఉండడం.. సొంత నియోజకవర్గంలో పార్టీకి చెందిన కార్పొరేటర్లు తిరుగుబావుట ఎగరవేయడం ఇబ్బందికరంగా మారింది.

ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కేటీఆర్ డీలా పడ్డారు. స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున రాజీనామా చేస్తూ ఉండడం, అది కూడా తన సొంత నియోజకవర్గంలో కావడంతో కేటీఆర్ టెన్షన్ పడుతున్నారు. ఇదే చాన్స్‌గా కేటీఆర్‌ను మరింత ఇరుకునపెట్టాలని రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీ ఎన్నికలలోపు.. మరింత కార్నర్‌ చేయాలని పక్కా స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.