CURRENT WAR: 24 గంటలు పవర్ ఉత్తిదే.. అడ్డంగా దొరికిపోయిన బీఆర్ఎస్
24 గంటల పవర్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు రేవంత్ సర్కార్‌కి అడ్డంగా దొరికిపోయింది. 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని తేలింది. మరోవైపు వేల కోట్ల బాకీ ఉందని తేలింది. విద్యుత్ సంస్థలకు అసలు 81 వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకైంది..?
CURRENT WAR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చిచ్చురేపిన 24 గంటల విద్యుత్‌పై ఇప్పుడు కూడా వార్ కంటిన్యూ అవనుంది. కాంగ్రెస్ వస్తే 3 గంటలే.. మేం 24 గంటల పవర్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు రేవంత్ సర్కార్‌కి అడ్డంగా దొరికిపోయింది. 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని తేలింది. మరోవైపు వేల కోట్ల బాకీ ఉందని తేలింది. విద్యుత్ సంస్థలకు అసలు 81 వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకైంది..? నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చిందా.. లాంటి అంశాలన్నీ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర గర్భ గుడి ఇదే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు..
మేమైతే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే.. 3 గంటలే అంటూ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ అయితే.. ప్రతి ఎన్నికల సభలోనూ ఇవే ఆరోపణలు. 24 గంటల కరెంట్ కావాలనే వాళ్ళు చేతులెత్తమని అడుగుతూ వచ్చారు. కాంగ్రెస్ నేతలు మాత్రం.. రైతులకు ఫుల్ పవర్ రావట్లేదు.. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్స్ చూద్దామని సవాల్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సబ్ స్టేషన్లకు వెళ్ళి లాగ్ బుక్స్ చూశారు. ఎక్కడా 24 అవర్స్ పవర్ ఇస్తున్నట్టు కనిపించలేదు. దాంతో మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా చూస్తారన్న ఉద్దేశ్యంతో రాత్రికి రాత్రే బుక్స్ దాచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టాక మొదటి రివ్యూ విద్యుత్‌పైనే చేశారు.
Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడైనా గెడ్డం తీస్తారా
డిస్కమ్‌లకు 81 వేల కోట్ల రూపాయలు అప్పులు ఎలా అయ్యాయి..? అసలు రైతులకు నిజంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారా..? వాస్తవంగా ఎన్ని గంటలు ఇచ్చారు అన్నదానిపై అధికారుల నుంచి వివరాలు రాబట్టారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో ఫుల్ పవర్ ఇవ్వలేదని.. ఆధారాలు, లెక్కలతో సహా నిరూపించేందుకు చిట్టాను రెడీ చేస్తున్నారు రేవంత్. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సప్లయ్ చేయకపోగా.. డిస్కమ్‌లను అప్పుల ఊబిలోకి బీఆర్ఎస్ సర్కారే నెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి రుజువు చేయబోతున్నారు. ప్రభుత్వం సకాలంలో డిస్కమ్‌లకు బాకీలు చెల్లించకపోవడం.. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ కరెంట్‌కు రీయింబర్స్ చేయకపోవడం వల్లే 81 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పబోతోంది.
వచ్చే వారంలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ విద్యుత్ అంశాలను ప్రస్తావించి గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతోంది కాంగ్రెస్ సర్కార్. అలాగే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి వచ్చే శనివారం సభలో మాట్లాడబోతున్నారు. అప్పుడు ఈ పవర్ లెక్కలను అసెంబ్లీ వేదికగా యావత్ తెలంగాణ జనానికి వివరించాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో బీఆర్ఎస్ సర్కార్ బండారం బయటపడుతుందనీ, అసెంబ్లీ రికార్డుల్లోకి ఎక్కుతుందని భావిస్తున్నారు. విద్యుత్ రంగంలో ఇంత కాలం రహస్యంగా ఉంచిన అవకతవకలను కూడా రేవంత్ సభలో బయటపెట్టే అవకాశాలున్నాయి.