VOLUNTEERS IN TS: తెలంగాణలోనూ వాలంటీర్లు .. జగన్ బాటలో రేవంత్ రెడ్డి..!
గ్రామస్థాయిలో వాలంటరీల వ్యవస్థ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో సీఎం రేవంత్ రెడ్డికి కూడా అర్థమైంది. అందుకే తెలంగాణలోనూ ఆ తరహా వ్యవస్థను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.
VOLUNTEERS IN TS: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను ఫాలో అవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో సక్సెస్ అయిన వాలంటీర్ వ్యవస్థను ఇక్కడ కూడా తేవాలని డిసైడ్ అయ్యారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ లీడర్ల మీటింగ్ లో ఈ విషయం బయటపెట్టారు రేవంత్. తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు.
PAWAN KALYAN: జనసేనకు షాక్.. పవన్‌కు ఈసీ నోటీసులు..
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు…ఆసరా ఫించన్లను వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి ఇవ్వడం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో లబ్దిదారుల ఎంపికకు, ప్రభుత్వ పథకాలను జనానికి వివరించడం లాంటి అంశాల్లో వాలంటీర్లు ఉపయోగపడతారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఎంత కీలకమో ప్రస్తుత ఎన్నికలను చూస్తే తెలుస్తోంది. వాళ్ళని తీసేయ్యాలని గతంలో చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఏమీ మాట్లాడలేని స్థితులో ఉన్నారు. మొన్నటి ఫించన్ల పంపిణీలో వాలంటీర్లు లేకపోవడంతో.. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు గ్రామ సచివాలయాలకు వచ్చారు.
CHANDRABABU NAIDU: ప్రజల కోసం నిలబడ్డ హీరో పవన్.. ఏపీని కాపాడేందుకే కూటమి: చంద్రబాబు
దాంతో చాలామంది అవస్థలు పడటం, కొందరు చనిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. గ్రామస్థాయిలో వాలంటరీల వ్యవస్థ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో సీఎం రేవంత్ రెడ్డికి కూడా అర్థమైంది. అందుకే తెలంగాణలోనూ ఆ తరహా వ్యవస్థను తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ముందుగా గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఒకరు, గ్రామంలో ఇద్దరు చొప్పున ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. అంటే దాదాపు లక్ష మందికి పైగా కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వం నెలకు నాలుగైదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని భావిస్తోంది. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేర్చడంలో ఈ కమిటీలు కీలకంగా ఉండబోతున్నాయి. ప్రజలు, ప్రభుత్వం మధ్య ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరిస్తాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు, ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల ఎంపిక లాంటి బాధ్యతలను ఇందిరమ్మ కమిటీలు, అందులో నియమించే వాలంటీర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆ తర్వాతే ఇందిరమ్మ కమిటీలు, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
https://www.youtube.com/watch?v=J6KI_xC66n8