నేను బన్నీ ఫ్యానే..తగ్గకపోతే వదలను.. చరణ్ ను చూసి నేర్చుకోండి.

సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సినిమా పరిశ్రమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి తన స్పందన చెప్పేశారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని గుర్తు చేసారు సీఎం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 09:07 PMLast Updated on: Dec 26, 2024 | 9:07 PM

Revanth Reddy Warning To Allu Arjun

సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సినిమా పరిశ్రమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి తన స్పందన చెప్పేశారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని గుర్తు చేసారు సీఎం. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పరిశ్రమ బాగుండాలని కోరుకున్నామని తన మనసులో మాట బయటపెట్టారు. ఐటీ, ఫార్మా తో మాకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యమని సినిమా పెద్దలకు క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామని… ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించామని సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామని సినీ పెద్దలకు వివరించారు. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చని… తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండని సినిమా వాళ్లకు సూచించారు సీఎం.

ముంబైలో వాతావరణం కారణం గా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందని… కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని హాలివుడ్,బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని సినిమా వాళ్లకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నామని పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే మా ఉద్దేశమని స్పష్టం చేసారు. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని సినిమా పెద్దలకు సూచించారు.

సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని గుర్తు చేసారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు ఆయన. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశమని సీఎం క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాదన్నారు. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఇక ముందు బెనిఫిట్ షోస్ కు అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసారు.

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అసలు అతనిపై నాకెందుకు కోపం ఉంటుందని… అతను ఏమైనా నా రాజకీయ శత్రువా అని నిలదీశారు. సినిమా ప్రముఖులు తో భేటీ లో అల్లు అర్జున్… రామ్ చరణ్ ల గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ విషయం లో అన్యధా భావించవద్దని అల్లు అరవింద్ కోరగా… ఆ విధంగా స్పందించారు రేవంత్. అల్లు అర్జున్.. రామ్ చరణ్ ఇద్దరు నాకు చిన్నప్పటి నుండి తెలుసని నాతో కలిసి తిరిగారన్నారు సీఎం. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా… చట్టం ప్రకారం వ్యవహరించాలి అనేది నా విధానమని స్పష్టం చేసారు.