REVANTH REDDY: రోజూ 18 గంటలు పని చేయాలి.. అధికారులకు సీఎం వార్నింగ్..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి. అలా పని చేయడం కుదరని వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకోవాలి.

REVANTH REDDY: ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేయాలని, అలా పని చేయలేని వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఆదివారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
Revanth Reddy: డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన.. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు
ఈ సందర్భంగా అధికారులకు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. “మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగలమనే ఆలోచనతో ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి. అలా పని చేయడం కుదరని వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకోవాలి. అలాంటివాళ్లు చీఫ్ సెక్రెటరీ, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలి. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా కలిసి పనిచేద్దాం. అధికారులకు మానవీయ కోణం చాలా ముఖ్యం.
Ponguleti Srinivasa Reddy: ఆరు గ్యారెంటీల అమలు.. 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా కలిసి పనిచేయాలి. సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేం. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే. తెలంగాణ డీఎన్ఏలోనే స్వేచ్ఛ ఉంది. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులకు ఫుల్ పవర్ ఇస్తున్నాం. అక్రమార్కులు, అవినీతి పరులు, భూకబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.