REVANTH REDDY: ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం.. మరి చంద్రబాబును తిడతారా?
ఏపీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ తరఫున ఇద్దరు ముఖ్యమంత్రులు స్టార్ క్యాంపెయినర్లు కాబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
REVANTH REDDY: ఏపీలో పొలిటికల్ మూడ్ మొదలైంది. రేపే ఎన్నికలు అన్న లెవల్‌లో పార్టీలన్నీ దూకుడు చూపిస్తున్నాయ్. వైసీపీ, టీడీపీ, జనసేన సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర విభజన తర్వాత.. దాదాపు పాతాళానికి పడిపోయిన హస్తం పార్టీ.. ఈసారి బౌన్స్‌బ్యాక్ కావాలని ప్లాన్ చేస్తోంది. దీనికోసం వైఎస్ బ్రాండ్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్పిన కాంగ్రెస్.. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తోంది. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత.. పార్టీలో అంతో ఇంతో కదలిక మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరుపుతున్న షర్మిల.. ముఖ్య నేతలను కలుస్తూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
Hyderabad Traffic Police: ఇదిదా క్రేజ్.. కుమారి ఆంటీని ఫాలో అవుతున్న పోలీసులు..
ఇక ఏపీలో పార్టీకి ఊపిరిలూదేందుకు ఏం చేసేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా కాంగ్రెస్ హైకమాండ్ కనిపిస్తోంది. పార్టీపరంగా షర్మిల ఎలాంటి డిమాండ్ ముందుపెట్టినా.. మరో ఆలోచన లేకుండా ఓకే అని చెప్పేస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ ఎన్నికల కోసం.. కాంగ్రెస్ తరఫున ఇద్దరు ముఖ్యమంత్రులు స్టార్ క్యాంపెయినర్లు కాబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఢిల్లీ పర్యటనలో సోనియాగాంధీతో ఇదే విషయంపై చర్చలు కూడా జరిపారు. దీనికి పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. దీంతో ఏపీలో రేవంత్ ప్రచారం దాదాపు కన్ఫార్మ్ అయినట్లే ! ఐతే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్న రేవంత్.. తన గురువు చంద్రబాబు మీద విమర్శలు చేయగలరా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఆరోపణలు, విమర్శలతో ఆపేస్తే.. ఏపీ రాజకీయాల్లో పని కాదు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలి. మరి చంద్రబాబు విషయంలో రేవంత్ ఆ పని చేయగలరా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న షర్మిల.. అన్న జగన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇద్దరు కలిసి కేంద్రంలో బీజేపీకి తొత్తులుగా మారారంటూ.. ప్రత్యేక హోదా విషయంలో నిలదీస్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఏపీలో ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్న రేవంత్.. చంద్రబాబును తిట్టగలరా లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. చంద్రబాబే తన రాజకీయ గురువు అని.. పదేపదే చెప్పే రేవంత్… ఏపీ ప్రచారంలో ఏ అంశాలు లేవనెత్తుతారన్నది ఆసక్తికరంగా మారింది.