రేవంత్ షాకింగ్ డెసిషన్.. గరికపాటికి కీలక పదవి
తెలంగాణలో ఇప్పుడు టెంపుల్ టూరిజం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. సినిమా వాళ్లు కూడా టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలంటూ గురువారం జరిగిన భేటీలో స్పష్టంగా చెప్పారు. దీనికి సినిమా పరిశ్రమ కూడా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.
తెలంగాణలో ఇప్పుడు టెంపుల్ టూరిజం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. సినిమా వాళ్లు కూడా టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలంటూ గురువారం జరిగిన భేటీలో స్పష్టంగా చెప్పారు. దీనికి సినిమా పరిశ్రమ కూడా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. తమ తమ సినిమాల్లో తెలంగాణ దేవాలయాలను ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇదే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు ఉన్న నేపథ్యంలో వాటిని అభివృద్ధి చేసేందుకు అలాగే వాటికి విశిష్ట ప్రచారం కల్పించేందుకు ఒక సలహాదారున్ని కూడా నియమించేందుకు సిద్ధమయ్యారు.
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకోనుంది. ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించి దేవాదాయ శాఖ అభివృద్ధికి… ఆయన సహకారం తీసుకోనున్నారు. దీనికి గరికపాటి కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా రేవంత్ రెడ్డి ఆయనకున్న సమర్థతను గుర్తించి సలహాదారుగా నియమించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు క్యాబినెట్ హోదా కల్పించింది.
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఆయన కృషి చేయనున్నారు. ఇప్పటికే ఆయనకు రెండు మూడు బాధ్యతలను అదనంగా కూడా అప్పగించారు. పుస్తకాలను ప్రచురించి వాటిని ఏపీ ప్రభుత్వ స్కూల్స్ తో పాటుగా ప్రవేట్ స్కూల్స్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఇక గరికపాటి నరసింహారావు కూడా ప్రతిభవంతుడు కావడంతో అలాగే విద్యావేత్త కూడా కావడంతో ఆయన విషయంలో రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా ఉన్నారు. సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో గరికపాటి నరసింహారావుకి మంచి క్రేజ్ ఉంది.
అయితే దీని వెనక మరో కారణం కూడా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో దేవాలయాలను కాస్త ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. గతంలో కెసిఆర్ కూడా చాలా దేవాలయాలకు అభివృద్దికి నిధులు కేటాయించారు. అందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హిందూ ఓటు బ్యాంకు దూరం కాకుండా రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్త పడుతున్నారు. గరికపాటితో పాటుగా మరో కీలక వ్యక్తిని కూడా సలహాదారు గాని నియమించుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. క్యాబినెట్ లో కూడా ఇప్పటికే దీనిపై ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తుంది. అయితే గరికపాటి ఫిబ్రవరి నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.