ముందు చిన్న చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు గొప్ప అన్నట్టుంది వైసీపీలో యాంకర్ శ్యామల వ్యవహారం. అమ్మనా బూతులు తిని అదే స్థాయిలో చిన్న పెద్ద చూడకుండా పచ్చి తిట్లు తిట్టిన రోజా.. ఉన్నది అమ్మి పార్టీ కోసం ఖర్చుపెట్టి.. టిడిపి వాళ్ళతో నానా మాటలు అనిపించుకున్న విడుదల రజిని.. యాంకర్ శ్యామల ముందు చిన్న బోయారు. కొత్త గ్లామర్ పేరుతో వైసీపీ అధినేత జగన్ యాంకర్ శ్యామలకి ఇచ్చిన వెయిట్ చూసి రోజా అలాగే రజినీలకు మింగుడు పడటం లేదు ఇప్పుడు. పార్టీ కోసం ఉన్నదమ్ముకున్న మాకు ఇప్పుడు అసలు విలువ లేదు అంటూ తమ సన్నిహితులు వద్ద కన్నీరు మున్నీరుగా వాపోతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో యాంకర్ శ్యామల పెద్ద హడావుడి చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు తన భర్త నరసింహారెడ్డి తో కలిసి వైసిపిలో జాయిన్ అయింది యాంకర్ శ్యామల. ఇక 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ యాక్టివ్ గా పని చేస్తూ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడుని కించపరిచే విధంగా కథలు చెబుతూ మీడియాలో బాగా హైలైట్ అయింది. ఇక వైసిపి సపోర్ట్ మీడియా కూడా యాంకర్ శ్యామలకు కాస్త గ్లామర్ ఉండటంతో వెయిట్ ఇచ్చింది. ఆమె ఏది మాట్లాడినా సరే వైసీపీ సోషల్ మీడియా కూడా వెంటనే షేర్ చేయడం హడావుడి చేయడం వంటివి జరిగాయి. ఇక వైసిపి అధికారంలో నుంచి దిగిన తర్వాత యాంకర్ శ్యామలకు అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చారు. ఇక అప్పటినుంచి మేడం గారి హడావుడి అంతా ఇంతా కాదు. మీడియాలో వేసే చిందుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక వైసిపి నేతలు కూడా ఆమెకు గట్టిగానే వెయిట్ ఇస్తున్నారు. కార్తీకమాసంలో అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన రెడ్డి కుల కార్తీక సమారాధన కార్యక్రమానికి గెస్ట్ గా ఈమెను ఇన్వైట్ చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అదే సామాజిక వర్గానికి చెందిన రోజాను ఇన్వైట్ చేయకుండా ఆమె ఇన్వైట్ చేయడం పట్ల అప్పట్లో వైసీపీ నేతలు కేతిరెడ్డి పై కాస్త ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు కూడా మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ అప్పుడప్పుడు పొడుపు కథలు చెబుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది యాంకర్ శ్యామల. అయితే దీనిపై వైసీపీ నాయకత్వం వద్ద విడుదల రజిని అలాగే ఆర్కే రోజా ఇద్దరూ తమ అసంతృప్తి వెళ్ళగక్కారట. ఒకపక్క తమను కేసులు పెట్టి బెదిరిస్తుంటే అయినా సరే తమ ధైర్యంగా బయటికి వచ్చి మాట్లాడుతున్నామని అలాంటి తమకు మీడియాలో ఎటువంటి ప్రయారిటీ ఇవ్వటం లేదని.. వైసీపీ సపోర్ట్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా పేజెస్ లో కూడా తమ మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటూ వాళ్ళిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారట. జగన్ కోసం తాను రోడ్ల మీదకు వచ్చి ఎన్నో కష్టాలు పడ్డానని.. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఆయన వెంటనే నడిచానని.. రోజా గతాన్ని గుర్తు చేసుకుంటే... ఇక విడుదల రజిని వైసీపీ కోసం తన ఆస్తులు కూడా అమ్ముకున్నానని.. అప్పట్లో టిడిపిలో బలమైన నాయకుడుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు లో ఎదిరించి పార్టీలో జాయిన్ అయి పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించానని, అలాంటి తన తన మీద కేసులు పెట్టి కూడా ఇప్పుడు వేధిస్తున్నారని.. ఇలాంటి టైంలో మీడియాలో కనీసం తనకు సపోర్ట్ లేదని, కొత్తగా వచ్చిన వాళ్లకు పార్టీలో ఇస్తున్న ఇంపార్టెన్స్ చిరాకుగా ఉందంటూ విడుదల రజిని వైసీపీ కీలక నేతల వద్ద తన ఆవేదన వెళ్లగక్కారు. ఎవరు ఏంటి అనేది పార్టీ అధిష్టానం ఆలోచించుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని అసలామె ఊరు, పేరు ఎవరికీ తెలియదని అలాంటి వ్యక్తికి అధికార ప్రతినిధి హోదా ఇచ్చి ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటూ మరికొంతమంది మహిళ నేతలు కూడా మండిపడుతున్నారు. జగన్ కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన తమ కంటే ప్యాకేజీ కోసం మీడియా ముందు హడావుడి చేసే యాంకర్ ఎక్కువయిందా అంటూ ఒక మహిళ నేత నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద అసహనం వ్యక్తం చేశారట. పార్టీ అధికారంలోకి తిరిగి రావాలి అంటే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయవద్దని వాళ్ల వల్ల ఒక్క ఓటు కూడా పడదంటూ సజ్జల వద్ద తేల్చి చెప్పారట విడుదల రజిని. ఒకానొక టైం లో భయపడి దండాలు పెట్టిన యాంకర్ శ్యామల ఇప్పుడు హడావిడి చేస్తే వైసిపి సోషల్ మీడియా ఏ విధంగా ఆమెను పైకి లేపుతుంది అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిలు వద్ద కూడా విడుదల రజిని ఫైర్ అయ్యారు.[embed]https://www.youtube.com/watch?v=29cVS7VylxA[/embed]