అల్లు అర్జున్ పై పెట్టారు.. చంద్రబాబుపై కేసు పెట్టాల్సిందే: రోజా
చంద్రబాబు అసమర్ధ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలని ఆమె డిమాండ్ చేసారు. అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని వీరు ఎవరికీ భక్తి లేదని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు అసమర్ధ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలని ఆమె డిమాండ్ చేసారు. అసమర్థ టీటీడీ చైర్మన్, ఎస్సీ, కలెక్టర్ వలనే ఈ పరిస్థితి వచ్చిందని వీరు ఎవరికీ భక్తి లేదని ఆమె ఆరోపించారు. చంద్రబాబు భజనే వీరికి ముఖ్యమన్నారు. పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారని వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆమె మండిపడ్డారు.
అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. అల్లు అర్జున్ కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారని మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. 105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా 194 సెక్షన్ ఎలా పెడతారు? అని ఆమె నిలదీశారు. ఆరుగురు భక్తులు చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆ పీఠాధిపతులు బయటకు రావాలి రోజా డిమాండ్ చేసారు.
చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని మోదీ కూడా దీనిపై స్పందించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయన్నారు. సనాతన యోధుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆరుగురిని చంపేసింది అని మండిపడ్డారు. ఎవరి నిర్లక్ష్యం వలన జరిగిందో తేల్చాలి అని డిమాండ్ చేసారు. అందరిపై కేసులు పెట్టించుకుని విచారణ జరిపించుకోవాలని చంద్రబాబు లెగ్ మహిమ వలన ఎప్పుడూ జనాల చావులు తప్పటం లేదన్నారు.