కాస్త బుద్ధి వాడు పవన్‌, రెచ్చిపోయిన రోజా

ఏపీ డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు. పిఠాపురంలో ఓ దళిత బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనను టార్గెట్‌ చేస్తూ.. ట్విటర్‌లో పవన్‌కు ప్రశ్నలు సంధించారు. " పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2024 | 06:59 PMLast Updated on: Oct 08, 2024 | 6:59 PM

Roja Fires On Pawan Kalyan

ఏపీ డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు. పిఠాపురంలో ఓ దళిత బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనను టార్గెట్‌ చేస్తూ.. ట్విటర్‌లో పవన్‌కు ప్రశ్నలు సంధించారు. ” పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. మీరు పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు విజయవాడ వరద బాధితుల కోసం, మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడి రోడ్డుపై కాదు వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం, మీరు గొడవపడాల్సింది మతాల కోసం కాదు నీట మునిగి సాయమందని పేదల కోసం, మీరు కడగాల్సింది మెట్లను కాదు ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని, మీరు దీక్ష చేయాల్సింది ప్రసాదాల కోసం కాదు రాష్ట్రంలో రాలి పోతున్న ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం, మీరు ఉపవాసం ఉండాల్సింది దేవుళ్ల కోసమే కాదు ఎక్కడ చూసినా ఆహారం కలుషితమై ఆసుపత్రి పాలౌతున్న విద్యార్థుల కోసం…

మీరు బొట్లు పెట్టాల్సింది గుడి మెట్లకు కాదు నాడు నేడుని కొనసాగించి బాగుపరిచిన బడి మెట్లకు మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది ఇప్పుడు ఏ లోటు లేని సనాతనం కోసం కాదు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం, మీరు ఆపసోపాలు పడాల్సింది కొండెక్కడం కోసం కాదు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు అరికట్టడం కోసం, మీరు సంప్రోక్షణ చేయాల్సింది కల్తీ జరిగిందో లేదో తెలియని లడ్డూ కోసం కాదు ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన కూటమి నాయకుల అవినీతి ప్రక్షాళన కోసం, మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన, దేవుడు తమరికి పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి స్వామీ” అంటూ ట్వీట్‌ చేశారు. సొంత నియోజకవర్గంలో దళిత ఆడబిడ్డకు అన్యాయం జరిగితే పట్టించుకోని డిప్యుటీ సీఎం ఈ రాష్ట్రానికి ఏం చేస్తారంటూ విమర్శించారు. సొంత పార్టీ నేతలు తప్పు చేశారు కాబట్టే పవన్‌ ఈ విషయం గురించి మాట్లాడకుండా రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆరోపించారు మాజీ మంత్రి రోజా.