రోజాకి పెద్దిరెడ్డి చెక్.. జగన్ పై తిరగబడ్డ రోజా..
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా 2029 ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగక తప్పదా? రోజాకు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ ఎర్త్ పెట్టేశారు. రోజాకు పోటీగా పార్టీలోనే కొత్త నేతను బరిలోకి దింపుతున్నారు పెద్దిరెడ్డి బ్యాచ్.

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా 2029 ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగక తప్పదా? రోజాకు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ ఎర్త్ పెట్టేశారు.
రోజాకు పోటీగా పార్టీలోనే కొత్త నేతను బరిలోకి దింపుతున్నారు పెద్దిరెడ్డి బ్యాచ్. దీంతో రోజా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ లో పడిపోయింది.
పెద్దిరెడ్డి ఏకంగా గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు రెండో కొడుకు జగదీష్ ను వైసీపీలో చేర్చేందుకు రంగ సిద్ధం చేశారు. దీంతో పిచ్చ ఫ్రస్టేషన్ లో పడిపోయిన రోజా జగన్ దగ్గర లబోదిబోమని జగదీష్ చేరికను తాత్కాలికంగా అడ్డుకోగలిగారు. అయితే త్వరలో జగదీష్ వైసీపీలో చేరడం , రోజా కి ఎర్త్ పెట్టడం ఖాయమని పెద్దిరెడ్డి వర్గాలు చెబుతున్నాయి. ఆమె మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా సొంత నియోజకవర్గం నగరిలో వ్యతిరేక గ్రూపులు బలంగా పనిచేశాయి. అ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీని తన కనుసన్నల్లో శాసించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు తీవ్ర విభేదాలున్నాయి.
ఇద్దరి మధ్య పార్టీ పెద్దలు చేసిన ప్యాచ్ వర్క్ కూడా పనిచేయ లేదు. నగరిలో రోజా ఓడిపోయాక… పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి. నగరి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సొంత తమ్ముడు జగదీష్‌ప్రకాష్ త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఆ చేరిక వెనక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారన్నది క్లియర్ కట్. గత ఎన్నికల టైంలోనే నగరి టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిం చారు జగదీష్. కానీ… అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడిక నేరుగా వైసీపీ కండువా కప్పి… నగరి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిశాకే మంట మండిపోతోందట రోజాకు. తనను నియోజకవర్గానికి దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ అధినేత దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి కి రోజా కి మొదటినుంచి విభేదాలే. నగరిలో తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది రోజా. చిత్తూరు జిల్లా అంతా తన కంట్రోల్లో ఉండాలనుకుంటాడు పెద్దిరెడ్డి. నీతో వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది . మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రోజా కి టికెట్ రాకుండా పెద్దిరెడ్డి వరకు చాలా ప్రయత్నించింది, అయినా రోజా కింద మీద పడి టికెట్ తెచ్చుకోవడంతో ఓడించడానికి కూడా పెద్దిరెడ్డి వరకు కృషి చేసింది.
ఇప్పుడు ఇక అగ్గికి ఆజ్యం పోసినట్టు తాజా పరిస్థితులు మారు ఉన్నాయి నగరిలో. పెద్దిరెడ్డి వల్లే నేను ఓడిపోయానన్న భావనలో ఉన్న రోజాకు ఇప్పుడు జగదీష్ ను పార్టీలోకి తీసుకు రావడం మరింత కోపం తెప్పించే విషయం. అందుకే జగదీష్ రాకను వ్యతిరేకిస్తూ నేరుగా ఈ మధ్య అధినేత జగన్నే కలిసి చెప్పారట మాజీ మంత్రి. తాత్కాలికంగా జగదీష్ ను అడ్డుకున్నప్పటికీ అధిష్టానం సమయంలో మార్పు లేకపోవడంతో… ఆమె తీవ్ర అసంతృప్తితో ఉంది.గత పదేళ్లుగా పెద్దిరెడ్డి అనుచరుల వల్లే తాను ఇబ్బందులు పడ్డానని, ఇప్పుడు మళ్లీ…సమాంతరంగా జగదీష్‌ను పార్టీలోకి చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పార్టీ పెద్దలను గట్టిగానే నిలదీసినట్టు సమాచారం. ఇదంతా పెద్దిరెడ్డి పనేనని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసింది రోజా. అదే జరిగితే తన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని తనకు బాగా దగ్గరగా ఉండేవాళ్లతో రోజా చెప్పేసింది కూడా.
ఇక ఆలస్యంగా నైనా జగదీష్ ప్రకాష్‌ను తీసుకోవడం ఖాయమైనందున రోజా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుడు పార్టీని వీడిన క్రమంలో… కీలకమైన మహిళా నేతగా ఉన్న రోజా కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే… పర్యవసానాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. నగరిలో జగదీష్ కంటూ ప్రత్యేకంగా అనుచరగణం ఏదీ లేదని, గాలి అభిమానులంతా ఎమ్మెల్యే భాను ప్రకాష్ దగ్గర ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న జగదీష్ వైసీపీకి భారం అవుతారే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదు అన్నది రోజా వాదన. ఇప్పుడున్న గ్రూపులకు చాలవన్నట్టు మరో కృష్ణుడి ఎంట్రీ అవసరమా రోజా ప్రశ్నిస్తుంది. జగదీష్ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీలో చేరకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న రోజా… తన ప్రయత్నాలు విఫలమైతే… ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
ఆమె వర్గం మాత్రం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చేస్తున్నారంటూ బయట చెపుతున్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అవ్వడం దగ్గరనుంచి ఎన్నోసార్లు తీవ్రస్థాయిలో అవమానాలకు గురైనా… పార్టీ కోసం కష్టపడి పనిచేశా నని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ఏ మాత్రం సహించేది లేదు అంటుంది రోజా. ఈ పరిస్థితుల్లో నగరి వైసీపీలోకి జగదీష్ ఎంట్రీ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? రోజా తదుపరి నిర్ణయం ఎలా ఉంటుంది? దేవుడిచ్చిన అన్న అంటూ… జగన్‌ని నెత్తిన పెట్టుకున్న మాజీ మంత్రి ఆ అన్నకు దూరంగా జరుగుతారా?లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాల్సి ఉంది. రోజా మాట నీ కాదని జగదీష్ ప్రకాష్ ను పార్టీలోకి తీసుకుంటే వైసీపీలో పరిస్థితులు ఎటు నుంచి ఎటైనా టర్న్ తీసుకోవచ్చు.