Rs 2000 Notes: జగన్, చంద్రబాబు కాదు.. అసలు తుగ్లక్‌ నిర్ణయాలు ఆయనవే!

రూ.2,000 నోటు నిర్ణయం తర్వాతి రోజే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఆ డెసిషన్‌ని విమర్శించారు. పలువురు ఆర్థికవేత్తలు కూడా నోటికి పని చెప్పారు. అయినా వెనక్కి తగ్గలేదు మోదీ. ఎందుకంటే ఆయన్ను అప్పుడు విమర్శించిన వాళ్లకంటే మద్దతిచ్చిన వాళ్లే ఎక్కువున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 20, 2023 | 01:15 PMLast Updated on: May 20, 2023 | 1:29 PM

Rs 2000 Notes Ban And Demonetization Biggest Failure By Modi

Rs 2000 Notes: టీడీపీ వాళ్లు జగన్‌ని.. వైసీపీ వాళ్లు చంద్రబాబుని కొన్ని సార్లు తుగ్లక్‌తో పొల్చుతుంటారు. వాళ్లు తీసుకునే తలా, తోక లేని నిర్ణయాలు అలానే ఉంటాయి మరి. అయితే అసలు సిసలైన తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ఇద్దరినే మించిపోయిన లీడర్‌ ఒకరున్నారు. అయనెవరో మీ అందరికీ తెలుసు.
పెద్ద నోట్ల రద్దు మాస్టర్‌ స్ట్రోక్‌ అన్నారు. ఆ దెబ్బతో ఉగ్రవాదులకు తిండీ, నీరూ లేక ఆకలితో అలమటించి భూగ్రహం దాటి నరకానికి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనన్నారు. అక్రమార్కుల ‘నల్ల’ నోట్ల కట్టలు ఇక చిత్తు కాగితాలేనని, ఇక కరెప్షనే లేని ఇండియాను చూడబోతున్నామని కొంతమంది సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి.. ఇండియాకు అసలు సిసలైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడేనని పొగుడుతూ మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆకాశానికి ఎత్తేశారు. సీన్‌ కట్ చేస్తే.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫ్లాప్‌ అని తాజాగా ఆర్బీఐ తీసుకున్న డెసిషన్‌ చూస్తే అర్థమవుతుంది. అది ఎలా అంటారా?
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే. ఎందుకుంటే బ్లాక్‌ మనీ మొత్తం పెద్ద నోట్లలోనే దాచుకుంటారు. 2016, నవంబర్‌ 8న మోదీ తీసుకున్న ఆ నిర్ణయంతో నల్లధనం దాచుకున్న బడాబాబుల గుండెల్లో గూడ్స్‌ రైలు పరుగులు తీసిందని బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేసుకున్నారు. ఇక ఈ దెబ్బతో ‘కరెప్షన్‌ ఫ్రీ ఇండియా’ అంటూ మోదీకి జేజేలు పలికారు. తీరా తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నోట్ల రద్దు తర్వాత చిన్నచిన్న వ్యాపారస్తులే తీవ్రంగా నష్టపోయినట్లు తేలింది. బ్యాంకుల ముందు పడిగాపులు కాసిన వాళ్లలో ఎక్కువగా మిడిల్ క్లాస్‌, పేద ప్రజలే కనిపించారు. డబ్బున్న వాళ్లు అక్కడక్కడ మాత్రమే కనిపించారు. వాళ్లు కూడా వైట్ మనీ బ్యాచ్‌. మరి బ్లాక్‌ మనీ దాచుకున్న వాళ్ల డబ్బుల కట్టలు మూసీ నదిలోనో, గంగానదిలోనో కొట్టుకుపోలేదు. బ్యాంక్‌ అధికారులతో కుమ్మకై.. నల్లధనాన్ని క్లీన్‌గా, వైట్‌గా మార్చుకున్నారు. రూ.500, రూ.1,000 నోట్ల కట్టల స్థానంలో రూ.2,000 నోట్లు రావడంతో బ్లాక్‌ మనీ దాచుకోవడం మరింత ఈజీ అయ్యింది.
పెద్ద నోట్ల రద్దు చేసి.. అంతకంటే పెద్ద నోటును తీసుకొచ్చారు మోదీ. అప్పటివరకు బ్లాక్‌ మనీ ఓ పది సూట్‌కేసుల్లో పట్టిందనుకుందాం.. ఇప్పుడు రూ.2,000 నోటు ఎంట్రీతో ఆ సూట్‌ కేసుల సంఖ్య 5కు తగ్గింది. ఇదే మాస్టర్ స్ట్రోక్‌..! అంటే సూట్‌ కేసు కంపెనీలకు ఇది బ్రెయిన్‌ స్ట్రోక్‌ కిందే లెక్క! రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి ఎవరైనా రూ.2,000 నోట్లను తీసుకొస్తారా? ఇదేం నిర్ణయం..? ఇలా ప్రశ్నించిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించారు.
రూ.2,000 నోటు నిర్ణయం తర్వాతి రోజే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ఆ డెసిషన్‌ని విమర్శించారు. పలువురు ఆర్థికవేత్తలు కూడా నోటికి పని చెప్పారు. అయినా వెనక్కి తగ్గలేదు మోదీ. ఎందుకంటే ఆయన్ను అప్పుడు విమర్శించిన వాళ్లకంటే మద్దతిచ్చిన వాళ్లే ఎక్కువున్నారు. వాళ్లలో చాలామంది దేశానికి ఏదో మంచి జరగబోతుందని ఆశించిన వాళ్లే. దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనతో, ఆ పార్టీ స్కామ్‌లతో విసిగిపోయిన ప్రజలు మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక ఆ నిర్ణయానికి సపోర్టు చేసిన మిగిలినవాళ్లంతా మోదీ అభిమానులు. ఏటీఎమ్‌ల ముందు వీరంతా కాళ్లు వాచేలాగా నిలబడ్డారు. వారితో పాటు సాధారణ మనుషులూ నిలబడ్డారు. నొప్పి ఇద్దరికి పుట్టినా బయటకు చెప్పుకున్నది మాత్రం కొందరే. ఎందుకంటే వాళ్లకి తెలియదు తుగ్లక్‌ నిర్ణయాలు సీజన్‌కు ఒకసారి మారిపోతాయని. లేకపోతే అప్పుడే అరిచి, ఏడ్చి గోలపెట్టేవారు.