JEEVAN REDDY: జీవన్ రెడ్డి మాల్.. గోల్ మాల్.. ఆర్మూర్ పాండు అక్రమాలు తేల్చాలంటున్న జనం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆర్మూర్ నడి బొడ్డున ఉన్నవిలువైన ఆర్టీసీ స్దలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ నిర్మించారు. ఆ మాల్‌లో బడా కంపెనీలకు లీజ్‌కు ఇచ్చి లక్షల్లో అద్దెలు తీసుకుని.. ఆర్టీసీకి స్ధలం అద్దె చెల్లించడంలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 01:42 PMLast Updated on: Dec 08, 2023 | 1:42 PM

Rtc And Transco Issue Notice To Jeevan Reddys Jeevan Mall In Armoor

JEEVAN REDDY: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన రెడ్డి అలియాస్ పాండు లీజు దందా పై.. రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టింది. ఆర్టీసీ లీజులపై కొరఢా ఝళిపించాలని కొత్త ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అధికారంలో ఉండగా ఆర్టీసీ స్ధలాన్ని లీజుకు తీసుకుని నిర్మించిన జీవన్ రెడ్డి మాల్‌కు నోటీసులు జారీ చేశారు. అద్దె బకాయిలు పేరుకు పోవడంతో యాక్షన్‌లోకి దిగారు ఆర్టీసీ అధికారులు. ఇటు విద్యుత్ బకాయిలు కోట్లలో పేరుకుపోవడంతో.. మాల్‌కు కరెంట్ సరఫరా నిలిపివేశారు.

CM REVANTH REDDY: యశోద హాస్పిటల్‌లో కేసీఆర్.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఆర్మూర్ నడి బొడ్డున ఉన్నవిలువైన ఆర్టీసీ స్దలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ నిర్మించారు. ఆ మాల్‌లో బడా కంపెనీలకు లీజ్‌కు ఇచ్చి లక్షల్లో అద్దెలు తీసుకుని.. ఆర్టీసీకి స్ధలం అద్దె చెల్లించడంలేదు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు జీవన్ రెడ్డి మాల్‌కు చాలాసార్లు నోటీసులిచ్చారు. మాల్ లీజుదారులు రూ.7 కోట్ల 27లక్షలకు పైగా అద్దె బకాయి పడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసి సిబ్బంది మాల్ దగ్గరకెళ్ళి మైక్‌‌లో బహిరంగంగా లీజ్ బకాయి వివరాలు ప్రకటించారు. మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే స్ధలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ బకాయిలు 2.5 కోట్ల రూపాయలు ఉండటంతో మాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నా వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌కు ఆనుకుని ఆ సంస్ధకు 7 వేల చదరపు గజాల స్ధలం ఉంది.

PRAJA DARBHAR: ప్రజాదర్బార్.. పదేళ్ల తర్వాత ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ.. పోటెత్తిన బాధితులు

ఈ స్ధలంపై కన్నేసిన ఆర్మూర్ పాండు 2013లో విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్ధ పేరుతో 33 ఏళ్ల లీజు ఒప్పందం చేసుకున్నారు. జీవన్ రెడ్డి భార్య రజితారెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఆర్టీసీ స్ధలాన్ని లీజుకు తీసుకుని ఐదు అంతస్ధుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గత ఏడాది దసరా రోజున జీవన్ రెడ్డి షాపింగ్ మాల్, మల్టీ ప్లెక్స్ ప్రారంభించారు. ఈ మాల్ ఆండ్ మల్టీప్లెక్స్‌లో.. దుకాణాలు, సినిమా హాళ్లను మల్టీ నేషనల్ కంపెనీలకు అద్దెకు ఇచ్చారు. సదరు కంపెనీల నుంచి అద్దె వసూలు చేసుకునే ఆర్మూర్ పాండు ఆర్టీసీకి మాత్రం అద్దె చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. ఇలా ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7 కోట్ల 23లక్షలకు చేరడంతో.. సంస్ధ అధికారులు లీజుదారు సంస్ధకు నోటీసు ఇస్తూ వచ్చారు. ఐనా ఎంతకూ చెల్లించకపోవడంతో.. హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్మూర్ నుంచి కొత్త ప్రభుత్వం ఆట మొదలు పెట్టడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

ఆర్మూర్ మాల్‌కు నోటీసులకుతోడు విద్యుత్ సరఫరా నిలిపివేత వ్యవహారం రాష్ట్రంలో ట్రెడింగ్‌గా మారింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి ఓడిపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. మొన్నటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో.. ఆయన దగ్గరకు వెళ్లి బకాయిల గురించి అడగడానికి అధికారులు భయపడే వారు. తాజాగా ఆర్టీసీ, విద్యుత్ అధికారులు బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం చర్చానీయాంశంగా మారింది. కాగా.. లీజును రద్దు చేసి ఆర్టీసీ తన స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్మూర్ జనం కోరుతున్నారు.