రేవంత్ 3 కాదు 4 ఫాం హౌస్ లు దమ్ముంటే కూల్చు: సబిత సవాల్

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీపై అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన రేవంత్ కు ఆగష్టు 15 ఇంకా రాలేదా ? అని నిలదీశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2024 | 03:48 PMLast Updated on: Oct 05, 2024 | 3:48 PM

Sabitha Indra Reddy Challenge To Revanth Reddy

మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీపై అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన రేవంత్ కు ఆగష్టు 15 ఇంకా రాలేదా ? అని నిలదీశారు. మైక్ తీసుకుంటే చాలు కెసిఅర్, కేటీఆర్, హరీష్ ను తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలేది లేదు అని హెచ్చరించారు.

ఫాక్స్ కాన్ కంపెనీ తెచ్చింది కేసీఆరే అని చెప్పిన సబిత… లక్ష ఉద్యోగాలు తెచ్చిన ఘనత కెసిఅర్ కే దక్కుతుందన్నారు. కేటీఆర్ రైతు ధర్నాకు వస్తున్నారని తెలిసి… ఫాక్స్ కాన్ కంపెనీకి రేవంత్ వస్తున్నారు అని ఎద్దేవా చేసారు. నాకు ముగ్గురు కొడుకులతో పాటు ఒక కూతురు ఉందన్న మాజీ మంత్రి నలుగురికి నాలుగు ఫార్మ్ హౌస్ లు కడతా కదా.. అవి ఎక్కడ ఉన్నా కూల్చుకోవచ్చు అని సవాల్ చేసారు.