జగన్ కు సాయి రెడ్డి షాక్.. నా జోలికి వస్తే వలిచేస్తా

ఏపీ రాజకీయాల్లో కూటమి 164 సీట్లతో అధికారంలోకి రావడం కంటే సంచలనం.. విజయసాయిరెడ్డి రాజకీయాలకు, వైసీపీకి గుడ్ బై చెప్పడం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 8, 2025 | 03:22 PMLast Updated on: Feb 08, 2025 | 3:22 PM

Sai Reddys Shock To Jagan I Will Beat Him If He Comes To My Rescue

ఏపీ రాజకీయాల్లో కూటమి 164 సీట్లతో అధికారంలోకి రావడం కంటే సంచలనం.. విజయసాయిరెడ్డి రాజకీయాలకు, వైసీపీకి గుడ్ బై చెప్పడం. వైయస్ జగన్ రాజకీయ జీవితంలో విజయసాయిరెడ్డిది అత్యంత కీలకపాత్ర. జగన్ నేడు రాజకీయంగా సేఫ్ జోన్ లో ఉన్నారంటే.. అది విజయసాయిరెడ్డి పుణ్యమే అనేది చాలామంది వైసిపి కార్యకర్తలకు క్లారిటీ ఉంది. వైసీపీ ఎన్ని ఇబ్బందులు పడినా సరే విజయసాయిరెడ్డి తాను ఉన్నాననే ధైర్యాన్నిస్తూ, జగన్ ను అన్ని విధాలుగా ముందుకు నడిపించారు.

ఇక జగన్ కూడా ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఉండటంతో ధీమాగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి నూటికి కోటి శాతం కారణం అనే విషయం వైసిపి కార్యకర్తలకు క్లారిటీ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయాలకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనమైంది. వైయస్ జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న విజయసాయిరెడ్డి సడన్ గా ఆ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ కార్యకర్తలు గాని.. వైసీపీ అధిష్టానం గాని ఊహించలేదు.

ఎటువంటి లీకులు లేకుండా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. సడన్ గా ఆయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. విజయసాయిరెడ్డి జగన్ కు కచ్చితంగా ఇబ్బందులు తెచ్చి పెడతారని చాలామంది వైసిపి నేతలు కూడా భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగన్ రాజకీయ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. విజయసాయిరెడ్డి వీడటం మాత్రం కచ్చితంగా జగన్ కు ఇబ్బందికర పరిణామమే. అలాంటి విజయం సాయి రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో..

ఆయన ఎప్పుడు ఏ విషయాలు బయటపెడతారో… అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇటీవల లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ కావడం ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా జగన్ తనపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందించారు. పార్టీ నుంచి విజయసాయిరెడ్డి తో పాటుగా మరో ముగ్గురు ఎంపీలు వెళ్లిపోవడం పట్ల వైయస్ జగన్ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. దీనిపై విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని, భయం అనేది ఏ అణువు అణువులోనూ లేదని, కాబట్టే రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ పదవులను.. మరి రాజకీయాలని వదులుకున్నా అంటూ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన వైసిపి నేతలు కార్యకర్తలు ఒకరకంగా షాక్ లోనే ఉన్నారు. విజయ సాయి రెడ్డి ఈ రేంజ్ లో కౌంటర్ ఇస్తారని వైసీపీ నేతలు అసలు ఊహించలేదు. మరి భవిష్యత్తులో ఆయన ఏవిధంగా ప్రవర్తిస్తారో చూడాలి. జగన్ రాజకీయ జీవితం గాని వ్యక్తిగత జీవితం గాని విజయసాయిరెడ్డి పైనే ఆధారపడి ఉంది అనే విషయంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. విజయసాయిరెడ్డి ఏ అడుగు వేసిన సరే జగన్ రాజకీయ జీవితంతో పాటుగా వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందులు పాలయ్యే సూచనలు ఉన్నాయి.