చంద్రబాబుకు మొహమాటం లేదు, ఛీ: సజ్జల

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారు, కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 05:33 PMLast Updated on: Dec 03, 2024 | 5:33 PM

Sajjala Fire On Cm Chandrababu Naidu

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారు, కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అన్న ఆయన పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదని స్పష్టం చేసారు. అభిమానులతో నడిచే పార్టీ ఇది, అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ అన్నారు. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉందని చెప్పుకొచ్చారు.

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉందన్న ఆయన వైఎస్సార్‌సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారని… ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నామన్నారు. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదని… తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారని మండిపడ్డారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నామన్నారు సజ్జల.

ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చిందని మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉందన్నారు. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారని మండిపడ్డారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎంగా ప్రమాణం చేయకముందే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు.