Sajjala Ramakrishna Reddy: బెయిలొస్తే నిర్దోషి అయిపోతారా.. చంద్రబాబుకు శిక్ష తప్పదు: సజ్జల రామకృష్ణా రెడ్డి

రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు 70 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని కోర్టును కోరారన్నారు. బెయిల్ కోసం చంద్రబాబుకు గుండె జబ్బు నుంచి చాలా రోగాలు ఉన్నట్లు చూపించారు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తే దానికి ఆయన నిర్దోషి అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 08:56 PMLast Updated on: Nov 20, 2023 | 8:56 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Naidus Bail

Sajjala Ramakrishna Reddy: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషి అయిపోరని విమర్శించారు వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సోమవారం చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సజ్జల మీడియాతో మాట్లాడారు. “చంద్రబాబుకు హైకోర్టు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది. బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషి అయిపోరు. చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే.

RS Praveen Kumar: బీసీ బిడ్డలపై దొరలు కుట్రలు చేస్తున్నారు: బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు 70 ఏళ్ల ముసలాయన కాబట్టి బెయిల్ ఇమ్మని కోర్టును కోరారన్నారు. బెయిల్ కోసం చంద్రబాబుకు గుండె జబ్బు నుంచి చాలా రోగాలు ఉన్నట్లు చూపించారు. చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఇస్తే దానికి ఆయన నిర్దోషి అన్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. బెయిల్ వచ్చినంత మాత్రమే అంతా అయిపోలేదు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. స్కిల్ స్కామ్ కేసులో ఆయన ఆయన విచారణ ఎదుర్కోక, శిక్ష అనుభవించక తప్పదు. కోర్టు చేసిన వ్యాఖ్యలు చూపకుండా ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది. ఈ కేసులో సీఐడీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. అరెస్టైనప్పటి నుంచి స్కిల్ కేసు గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడడం లేదు. ఆయనపై ఇంకా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు న్యాయవాదులు ఏ రోజూ స్కిల్‌ స్కామ్‌ జరగలేదని వాదించలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం కేసులను చంద్రబాబు ఎదుర్కోవాలి.

చంద్రబాబు షెల్‌ కంపెనీల పేరుతో ప్రజల సొమ్మును దోచేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే స్కిల్‌ డెవలప్మెంట్ స్కామ్‌ జరిగింది. సీఎం నిధులు విడుదల చెయ్యమంటేనే విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చంద్రబాబు త్వరలో విజయయాత్ర చేస్తామంటున్నారని, అనారోగ్యం ఉంటే ఆయన యాత్రలు ఎలా చేస్తారు..? టీడీపీ నేతలు స్కిల్ కేసుతో సంబంధం లేదని ఎప్పుడూ మాట్లాడడం లేదు” అని సజ్జల వ్యాఖ్యానించారు.