చంద్రబాబు నీకు పొగరా…? నాకే పాపం తెలీదు: సజ్జల

అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి సజ్జల క్లారిటీ ఇచ్చారు. దానిపై మేము న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం అని స్పష్టం చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 16, 2024 | 04:46 PMLast Updated on: Oct 16, 2024 | 4:46 PM

Sajjala Sensational Comments On Chandrababu Naidu

అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. తనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి సజ్జల క్లారిటీ ఇచ్చారు. దానిపై మేము న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం అని స్పష్టం చేసారు. ఏడో తేదీన ఫ్యామిలీతో వేరే దేశానికి వెళ్లానని… 14న తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీ ఎయిర్ పోర్టులో అభ్యంతరం తెలిపారని… కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. నేను హైదరాబాద్ వెళ్లి, తాడేపల్లి వస్తున్నా అన్నారు. మీ పెండ్యాల శ్రీనివాసరావు, ఇతర నేతల్లాగ నేనేమీ పారిపోవడం లేదు అని స్పష్టం చేసారు.

కానీ లుకౌట్ నోటీసులు పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం జరిగిన టీడీపీ ఆఫీసు మీద దాడి కేసును ఇప్పుడు బయటకు తీశారు అని మండిపడ్డారు. అసలు ఆ దాడి జరగడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసన్నారు. టీడీపీ నేతలు సీఎం జగన్ ని దారుణంగా దూషించారని సుప్రీంకోర్టు నాకు ఇంటీరియమ్ ప్రొడక్ట్ ఇచ్చిందని అన్నారు. అదికూడా సెప్టెంబర్ 20నే ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు నోటీసులు ఎలా ఇస్తారు? అని నిలదీశారు. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు.

దీన్ని బరితెగింపు అనాలా..? పొగరు అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమాత్రం బేస్ లేని విషయాలలో కూడా నోటీసులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్మెంట్ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది అన్నారు. అందుకే ఆస్తుల అటాచ్మెంట్ జరిగిందన్నారు. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు అని మండిపడ్డారు.

అంతకన్నా బరితెగింపు ఉంటుందా అంటూ సజ్జల ప్రశ్నించారు. అలా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించగలరేమోగానీ కోర్టును నమ్మించలేరనన్నారు. జత్వానీ కేసులో కూడా నన్ను ఇలాగే ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసారు. ఏదోలాగ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని సజ్జల ఆరోపించారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగా జగన్ ని దూషించారని అప్పుడు టీడీపీ ఆఫీసుపై గొడవ జరిగిందన్నారు. జగన్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎలాంటి నేరం జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారని బోట్లతో ప్రకాశం బ్యారేజిని కూల్చాలని ప్లాన్ చేశారని కూడా కేసులు పెట్టారని సజ్జల అసహనం వ్యక్తం చేసారు.