Samantha Ruth Prabhu: సైకిల్‌ గుర్తుకు ఓటేయాలంటున్న సమంత.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో..

ఏపీలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది. పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయ్. ఐతే అభివృద్ధికి ఓటు వేయండి.. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ.. సమంత చెప్తున్న ఓ వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 04:50 PMLast Updated on: Feb 29, 2024 | 4:50 PM

Samantha Ruth Prabhus Video Goes Viral About She Asking Vote For Tdp

Samantha Ruth Prabhu: సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తన డెయిలీ లైఫ్‌ విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు. చైతూతో విడాకుల తర్వాత మయోసైటిస్‌ బారినపడిన సామ్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. పెళ్లికి ముందు.. విడాకుల తర్వాత.. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే సమంత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల కాలం నడుస్తోంది. ఏపీలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

Anant ambani pre wedding: అంబానీ ఇంట పెళ్లి వేడుక.. 51 వేల మందికి అన్నసేవ.. 2,500 రకాల వంటలు

పార్టీలన్నీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయ్. ఐతే అభివృద్ధికి ఓటు వేయండి.. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ.. సమంత చెప్తున్న ఓ వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ప్రస్తుత చికిత్స తీసుకుంటున్నారు. అలాంటిది.. ఆమె ఈ వీడియో చేయడం ఏంటి అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఐతే ఈ వీడియో నిజమా కాదా అని తెలియాలంటే.. సమంత రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక.. చాలా దారుణాలు కనిపిస్తున్నాయ్. వీడియోలు, ఆడియోలు.. వాయిస్‌లు.. అన్నీ మార్ఫ్‌ చేసేస్తున్నారు. సమంత వీడియో కూడా అలాంటిదే అనే డిస్కషన్ నడుస్తోంది. ఐతే ఈ వీడియో ఎప్పుడో పాతదిలా కనిపిస్తోంది.

లిప్‌ సింక్ పర్ఫెక్ట్‌ అనిపించడంతో.. ఆ వీడియో కింద రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఐతే ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితికి.. ఓ పార్టీ కోసం ఇలాంటి పోస్ట్‌ పెట్టే చాన్స్ లేదని.. ఇదంతా ఏఐ మాయ అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. టీడీపీ ఫర్ పీపుల్‌ 2024 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో.. ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియో సంగతి ఎలా ఉన్నా.. మయోసైటిస్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.