జగన్ నచ్చలా, పవన్ నచ్చారు: సామినేని
డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ను మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కలిసారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ను మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను కలిసారు. ఈ సందర్భంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పవన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… జగన్ విధానాలు నచ్చక పార్టీని విడుతున్న అని స్పష్టం చేసారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నా అని తెలిపారు. నాతో ప్రయాణం చేసే వాళ్ళని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.
జనసేన పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తా అని స్పష్టం చేసారు. కూటమి కి తగ్గట్టు వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటాను అన్నారు. ఈనెల 22న జనసేనలో జాయిన్ అవుతున్నాను అని రేపు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉందని తెలిపారు.