Seethakka: హరీష్ రావుకు మంత్రి సీతక్క మాస్ కౌంటర్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చారు సరే.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఇస్తాం అని చెప్పగానే సరిపోదని.. ఎప్పుడు వేస్తారో రైతులకు క్లియర్‌గా చెప్పాలంటూ ప్రశ్నించారు.
Seethakka: శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కొత్త అసెంబ్లీ ప్రారంభమైంది. ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే క్రమంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చారు సరే.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఇస్తాం అని చెప్పగానే సరిపోదని.. ఎప్పుడు వేస్తారో రైతులకు క్లియర్‌గా చెప్పాలంటూ ప్రశ్నించారు.
CM Revanth : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కేసీఆర్ టీం మొత్తం అవుట్..
హరీష్ రావు ప్రశ్నలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలకు డబ్బులు అవసరం అనుకుంటా.. అందుకే రైతుబంధు డబ్బులు అడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. పెద్ద పెద్ద ఫాహౌజ్‌లు ఉన్నోళ్లు, వేల ఎకరాలు ఉన్న మాజీ మంత్రులు మాత్రమే ఈ రైతుబంధుతో అధికంగా లాభం పొందారంటూ చెప్పారు. రైతుబంధులో చాలా లొసుగులు ఉన్నాయని, గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయని సీతక్క ఆరోపించారు. ఈ పథకం అమలు తీరుపై పూర్తి స్థాయిలో సీఎం రివ్యూ నిర్వహించబోతున్నట్టు చెప్పారు.
రివ్యూ పూర్తైన తరువాత డబ్బులు వేస్తామంటూ చెప్పారు. విద్యుత్ శాఖలో కూడా ఇదే స్థాయిలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోయాడంటూ చెప్పారు. రాజీనామా చేస్తున్న ప్రతీ అధికారి, వివిధ శాఖల చైర్మన్లు పూర్తి స్థాయిలో లెక్కలు క్లియర్ అయ్యాకే వెళ్లాలంటూ చెప్పారు.