Smita Sabharwal : ప్లీజ్ నన్ను అర్ధం చేసుకోండి..
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు డైనమిక్ ఆఫీసర్‌గా పేరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులనూ పర్యవేక్షించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు డైనమిక్ ఆఫీసర్‌గా పేరుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులనూ పర్యవేక్షించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంవో అధికారిగా కూడా పని చేశారు. అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆమె రేవంత్‌ను కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.
ఆ వార్తలకు బలం చేకూరుస్తూ.. ఆమె బుధవారం ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. కొత్త ఛాలెంజ్‌లకు ఎప్పుడూ సిద్దం అంటూ స్మిత ఆ ట్వీట్‌లో తెలిపారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లటం ఖాయమనే ప్రచారం జరిగింది. ఆమె భర్త అకున్ సబర్వాల్ కూడా ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్నారు. దీంతో స్మితా కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని కథనాలు వచ్చాయి. దీంతో ఆమెను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో చేసిన వన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోడం కొంత మంది ఐఏఎస్ లకు ఫ్యాషన్ అయ్యిందని ఆయన ట్వీట్ చేశారు.
ఇలా సోషల్ మీడియాలో కథనాలు, మాజీ ఐఏఎస్‌ల ట్వీట్ల నేపథ్యంలో తాను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే అంశంపై స్మితా సబర్వాల్ స్పందించారు. తాను డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నానేది పూర్తిగా అబద్ధమని.. అవి ఆధారాల్లోనే కథనాలు అని చెప్పారు. తెలంగాణ కేడర్‌కు చెందిన IAS అధికారిగా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయాణంలో భాగమనైందుకు గర్విస్తున్నానని ట్వీట్ చేసి.. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారన్న వార్తలకు చెక్ పెట్టారు స్మితా సబర్వాల్. అంతే కాదు చాలా రోజుల సస్పెన్స్ తర్వాత సచివాలయంలో కనిపించారు. మంత్రి సీతక్కని కలిశారు. దీంతో ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది.