బన్నీ అరెస్ట్ పై సెన్సేషనల్ సర్వే, మైండ్ బ్లాక్ రిజల్ట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలమైంది. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ భారీగా ఉండటంతో నేషనల్ మీడియా కూడా ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే ఫోకస్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా సంచలమైంది. అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ భారీగా ఉండటంతో నేషనల్ మీడియా కూడా ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే ఫోకస్ చేసింది. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆ రోజు రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆ తర్వాత అల్లు అర్జున్ పై అలాగే థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేయడం అన్నీ కూడా సెన్సేషన్ అయ్యాయి.
ఇక ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ ను ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత శుక్రవారం జరిగిన ఈ అరెస్టు వ్యవహారంతో సినిమా పరిశ్రమ కూడా షాక్ అయింది. సాధారణంగా సినిమా వాళ్ళ పై కేసులు పెట్టడమే కానీ అరెస్టు చేసిన పరిస్థితులు చాలా తక్కువ. బాలీవుడ్ లోనే ఒకరిద్దరు హీరోలను అదుపులోకి తీసుకున్నారు. కానీ మన తెలుగులో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పెద్ద దుమారమే రేగింది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి… అల్లు అర్జున్ పై కక్షగట్టి అరెస్టు చేశారనే అభిప్రాయాలు కూడా వినపడ్డాయి.
అల్లు అర్జున్ ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే దీని కారణమని కొంతమంది, అలాగే వైఎస్ జగన్ కు సహకరించటమే కారణమని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ వచ్చారు. అరెస్ట్ జరిగిన రోజునే బన్నీకి బెయిల్ వచ్చినా… బెయిల్ పేపర్లు ఆలస్యం కారణంగా ఒక రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దీనిపై తాజాగా జాతీయ మీడియా సర్వే చేసింది ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ విషయమై ప్రశ్నం.ఏఐతో కలిసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానంలో సర్వే నిర్వహించింది.
ఇందులో ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందా? అనే ప్రశ్నకు 2,502 మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది సదరు సంస్థ. ఇందులో 34 శాతం మంది అంటే 843 మంది ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. ఇక 33 శాతం మంది… లేదంటే 841 మంది ‘కాదు’ అని సమాధానం ఇచ్చారు. అంటే బన్నీ తప్పు చేసాడనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక 14 శాతం మంది ‘ఏం చెప్పలేము’ అని సమాధానం చెప్పారు. చివరిగా 19 శాతం మంది ‘సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు’ అని తమ ఆన్సర్ లు ఇచ్చారు.