బెట్టింగ్ యాప్స్‌లో సంచలన మలుపు, వాళ్లందరి మీద కేసులు నమోదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో కీలక మలుపు చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న 19 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో కీలక మలుపు చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న 19 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహించేవాళ్లను టార్గెట్ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఈ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.
మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 25 మంది సెలబ్రెటీల మీద కేసులు నమోదు చేశారు. వీళ్లందరినీ సాక్ష్యులుగా మార్చి బెట్టింగ్ యాప్స్ నిర్వహించేవాళ్లను బుక్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు పెరగడంతో ఇల్లీగల్ యాప్స్ నిర్వహించే వాళ్ల భరతం పడుతున్నారు పోలీసులు.