విష్ణు ప్రియ ఫోన్‌లో సంచలనాలు.. అమ్మడి పని అయిపోయినట్లే..

బెట్టింగ్‌ యాప్‌లను ఎంకరేజ్ చేస్తూ.. ప్రమోట్ చేస్తూ.. యూత్‌ను పక్కదారి పట్టిస్తున్న సెలిబ్రిటీల చెమడాలు తీసేందుకు.. తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 10:45 PMLast Updated on: Mar 20, 2025 | 10:45 PM

Sensations On Vishnu Priyas Phone

బెట్టింగ్‌ యాప్‌లను ఎంకరేజ్ చేస్తూ.. ప్రమోట్ చేస్తూ.. యూత్‌ను పక్కదారి పట్టిస్తున్న సెలిబ్రిటీల చెమడాలు తీసేందుకు.. తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు. పంజాగుట్ట పీఎస్‌లో ఏకంగా 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. కేసులో సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు.. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసి కోట్లు సంపాదించిన హర్ష సాయి, సన్నీ యాదవ్, రాజు భయ్యా, నటి శ్యామల, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ సన్నీతో సహా మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లతో పాటు.. నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ కూడా కేసులు ఫైల్ అయ్యాయ్‌. మియాపూర్ ప్రగతి ఎన్ క్లేవ్‌లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు.. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నటులు, యూట్యూబర్స్‌కు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడంతో… పైసలకు ఆశపడి యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక అటు ఈ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయన్సర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. నటి, యాంకర్‌ విష్ణు ప్రియను విచారణకు ఆదేశించగా.. ఆమె హాజరయింది. ఐతే తాను బెట్టింగ్‌ ప్రమోషన్ చేసినట్లు.. విష్ణుప్రియ అంగీకరించింది. తాజ్ ట్రిపుల్ సెవన్ బుక్ డాట్ కామ్‌ అనే వెబ్‌సైట్‌లో.. విష్ణుప్రియ ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమోషన్ చేసింది. ఆమె ప్రమోట్ చేసిన వీడియోను చూపించి మరీ పోలీసులు విచారించారు. ఆ తర్వాత ప్రశ్నల వర్షం గుప్పించారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయడం నేరమని తెలియదా…

బెట్టింగ్ యాప్‌ల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలుసా.. ప్రమోట్ చేయడం ద్వారా ఎంత వచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఐతే విష్ణుప్రియ మొత్తం 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రమోషన్ దందా సాగించినట్లు టాక్. ఇక అటు విష్ణుప్రియను దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించిన పోలీసులు.. ఆమె బ్యాంకు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. మొబైల్ కూడా సీజ్‌ చేశారు. విష్ణుప్రియ ఫోన్‌లో సంచలనాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నయానే చర్చ జరుగుతోంది. బెట్టింగ్ యాప్స్ తో ఉన్న లావాదేవీలు, ఫోన్ కాల్స్‌లాంటి అంశాలపై లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. దీంతో విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది..