మినిస్ట్రీ ఆఫ్ సె*క్స్ రష్యాలో కొత్త మంత్రిత్వ శాఖ ?
రెండేళ్ల నుంచి రష్యా వణికిపోతోంది. పేరుకు పెద్ద దేశమే ఐనా ఉక్రెయిన్ పెడుతున్న టెన్షన్‌తో షేకైపోతోంది. దాదాపు 24 నెలల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిపోయిన రష్యా ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.
రెండేళ్ల నుంచి రష్యా వణికిపోతోంది. పేరుకు పెద్ద దేశమే ఐనా ఉక్రెయిన్ పెడుతున్న టెన్షన్‌తో షేకైపోతోంది. దాదాపు 24 నెలల నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిపోయిన రష్యా ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా రష్యాలో జనన-మరణాల్లో గ్యాప్ భారీగా పెరుగుతున్నట్లు రష్యన్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ గ్యాప్‌ను కవర్ చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పెరుతో కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసే ఆలోచనలో రష్యా ఉన్నట్టు తెలుస్తోంది. కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. జనన మరణాల రేటులో గ్యాప్‌ను తగ్గించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయాలంటూ అధ్యక్షుడు పుతిన్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఓ ఏజెన్సీ ఈ ప్రతిపాదన చేసింది.
బర్త్ రేట్‌ను పెంచే కార్యక్రమాలన్ని ఈ శాఖ పరిధిలో ఉంచాలంటూ కొన్ని సూచనలు చేసింది. బంధాలను ప్రోత్సహించేందుకు యువతకు ఫస్ట్ డేట్‌కు 5 వేల రూబెల్స్ ఇవ్వాలని సూచించింది. ఇంటిపనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకునేవారికి కొంత మొత్తం చెల్లించాలని చెప్పింది. వీటితో పాటు మరికొన్ని అసాధారణ ప్రతిపాదనలు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ బర్త్ రేట్‌ను పెంచడం కోసం మహిళల వ్యక్తిగత వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డేటా సేకరణలో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులకు కొన్ని ప్రశ్నలతో కూడిన ఫామ్స్ అందినట్లు తెలుస్తోంది. రష్యా ప్రభుత్వం సేకరించిన సమచారం ప్రకారం రష్యా లో ఈ ఏడాదిలో జూన్ వరకు 5 లక్షల 99 వేల 600 మంది పిల్లలు జన్మించారు. 2023 జూన్‌తో పోలిస్తే దాదాపు 16 వేల మంది పిల్లలు తక్కువగా పుట్టారు.
1999 నుంచిక రష్యాలో జననాల రేటులో తగ్గుదల కనిపిస్తోంది. మరోపక్క 2024 జనవరి నుంచి జూన్ మధ్య 3 లక్షల 25 వేల 100 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 49 వేలు పెరిగాయయి. రష్యాకు వచ్చిన వలసదారుల జనాభా 20.1 శాతం ఉండటంతో ఈ క్షీణత కొంతవరకు భర్తీ అయ్యింది. కొన్నేళ్లుగా దేశంలో జనాభా పెరగడానికి సోవియట్ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని 2022లో అధ్యక్షుడు పుతిన్ మళ్లీ రీస్టార్ట్ చేశారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్ రూబెల్స్.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 13 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రైజ్ మనీతో పాటు ‘మదర్ హీరోయిన్’ పేరుతో అవార్డును కూడా ఇస్తోంది రష్యన్ ప్రభుత్వం. అయితే 10వ బిడ్డ మొదటి పుట్టినరోజు నాడు ప్రభుత్వం ఈ ప్రైజ్ మనీ ఇస్తుంది. అప్పటి వరకూ మిగిలిన 9 మంది పిల్లలు కూడా ప్రాణాలతోనే ఉండాలి. అప్పుడు మనీ వస్తుంది. ఈ స్కీమ్‌తో పాటు సెక్స్ మంత్రిత్వ శాఖలో జనన మరణాల రేటులో ఉన్న గ్యాప్‌ను కవర్ చేయాలని భావిస్తున్నారట పుతిన్.