జగన్ చేయలేనిది, షర్మిల చేసారా…?
మేము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి ,యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు వైఎస్ షర్మిల.
మేము పెట్టిన 48 గంటల గడువుకి దిగివచ్చి ,యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మాట ఇస్తున్నాం…. కాంగ్రెస్ పార్టీ మీ పక్షం, మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని ఆమె స్పష్టం చేసారు.
ఇవ్వాళ కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడి గెలిచాం అన్నారు. ఇదే స్పూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. మోడీ మెడలు వంచి మన ఆత్మగౌరవం విశాఖ ఉక్కును పరిరక్షించుకుందామన్నారు. కాగా ఈ విషయంలో వైసీపీ పోరాటం చేయకపోయినా షర్మిల చేయడం, అటు విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా తగ్గడం హాట్ టాపిక్ అవుతోంది.