వైసీపీ జగన్ ది కాదు ఆ ముగ్గురిదే, షర్మిల హాట్ కామెంట్స్

వైద్య,విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ గారు అనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 01:32 PMLast Updated on: Aug 31, 2024 | 1:32 PM

Sharmila Fires On Chandrababu Naidu

వైద్య,విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ గారు అనాడు పెద్ద తప్పు చేస్తే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నడుస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు,ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరు తొలగించడాన్ని.. కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోంది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అయినా వైఎస్సార్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి పాటుపడిన వాళ్ళే అన్నారు షర్మిల.

పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్లే అని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదు అన్నారు షర్మిల. వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్,రుణమాఫీ, ఉచిత కరెంట్,పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు షర్మిల. వైఎస్సార్ ఏ ఒక్క పార్టీకి సొంతం కాదని షర్మిల పేర్కొన్నారు. తెలుగు వారి ఆస్తి… తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలం అని అన్నారు. వైసీపీ మీద కోపాన్ని వైఎస్సార్ మీద రుద్దవద్దని కోరారు. వైసీపీలో వైఎస్సార్ లేరన్నారు షర్మిల అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనే అంటూ సంచలన కామెంట్స్ చేసారు.