బ్రేకింగ్: ప్యాలెస్ లో ఆ దొంగ ఎవరు, షర్మిల సంచలన కామెంట్స్

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు... పెద్ద డొంకలు కూడా కదలాలి అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 01:47 PMLast Updated on: Sep 28, 2024 | 1:47 PM

Sharmila Sensational Comments On Apmce Scam

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదు… పెద్ద డొంకలు కూడా కదలాలి అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలి అని డిమాండ్ చేసారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే… తెరవెనుక ఉండి,సర్వం తానై, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు ఆమె.

5 ఏళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారు అని ఆమె ఆరోపించారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు అని టెండర్లు,ఒప్పందాలు, APMMC నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు అని విమర్శలు చేసారు షర్మిల. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిభందలను తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు సొంత ఖజానాకు తరలించారు అని గత ప్రభుత్వ హయంలో జరిగిన మైనింగ్ కుంభకోణంపై ఏసీబీ విచారణతో పాటు.. పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందఐ అభిప్రాయపడ్డారు. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కోరారు.