రేవంత్ కు షర్మిల విషెస్

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 02:49 PMLast Updated on: Dec 07, 2024 | 2:49 PM

Sharmila Wishes Revanth

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, సహచర మంత్రులకు, ఎమెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయ పూర్వక అభినందనలు అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, సంక్షేమ, అభివృద్ధి రాజ్యంగా, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయం. కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి. హస్తమే దేశానికి అభయహస్తం అని ఆమె కొనియాడారు.